Headlines

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా! | Argentina Sea Dried Up? Viral Video Showing Boats Stranded on Beach Is Misleading, Here’s the Real Reason video tv9d – Viral Videos in Telugu


అర్జెంటీనాలో సముద్రం పూర్తిగా ఎండిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. సముద్రపు నీరు అకస్మాత్తుగా వెనక్కి తగ్గిపోవడంతో, తీరంలో ఉండాల్సిన పడవలు ఇసుకలో చిక్కుకున్న దృశ్యాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలు అర్జెంటీనాలో సముద్రం మాయమైందా? దీని వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు. జనవరి 2026లో అర్జెంటీనాలోని మార్ డెల్ ప్లాటా సమీపంలోని శాంటా క్లారా డెల్ మార్ ప్రాంతంలో ఒక అరుదైన ‘మెటియోసునామీ’ పరిస్థితి తలెత్తింది. బలమైన గాలుల దిశలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల కారణంగా సముద్రపు నీరు తాత్కాలికంగా కొంతసేపు వెనక్కి వెళ్లింది. దీంతో సాధారణంగా నీటిలో మునిగి ఉండే సముద్రగర్భం బయటపడటంతో పాటు పడవలు ఇసుకలో కూరుకుపోయాయి. అయితే ఇది శాశ్వతంగా జరిగిన పరిణామం కాదు. కొద్దిసేపటి తర్వాత సముద్రపు నీరు యథావిధిగా తిరిగి తీరానికి చేరుకుంది. కానీ ఈ లోపే కొందరు దీనిని సముద్రం ఎండిపోయిందంటూ తప్పుదోవ పట్టించే ప్రచారానికి తెరలేపారు. మరోవైపు, పరానా నదిలో కరువు ప్రభావంతో నీటి మట్టం తగ్గడాన్ని కూడా ఈ సముద్ర ఘటనతో ముడిపెట్టి సోషల్ మీడియాలో కొందరు గందరగోళం సృష్టించారు. పరానా నదిలో నీరు తగ్గడం వేరు, సముద్రంలో సంభవించిన ఈ తాత్కాలిక వాతావరణ మార్పు వేరు. అర్జెంటీనా తీరంలోని అట్లాంటిక్ మహాసముద్రం ఎప్పుడూ లేని విధంగా ఎండిపోయిందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెక్ సంస్థలు స్పష్టం చేశాయి. కేవలం ఒక అరుదైన వాతావరణ మార్పు వీడియోను చూసి జనం భయపడవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

లోను తీసుకున్న వ్యక్తి కట్టలేకపోతే.. అది ఎవరు చెల్లించాలి.. బ్యాంకు రూల్స్‌ ఇవే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *