Headlines

ఆసక్తి రేపుతున్న ‘అ’ మూవీ బ్లడీ హంగర్‌ గ్లింప్స్.. డార్క్ థ్రిల్లర్‌‌గా రానున్న మూవీ | AH Movie Glimpse video Staring Vijay, Archana Iyer


డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్నథ్రిల్లర్‌ మూవీ అ. ఈ సినిమాలో రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి బ్లడీ హంగర్‌ గ్లింప్స్ విడుదల చేశారు. కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

డైలాగ్స్ లేకుండా రూపొందించిన ఈ గ్లింప్స్.. భయానక విజువల్స్, ఆసక్తికరమైన కథనంతో మొదటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. యువతుల అదృశ్యానికి సంబంధించిన ఓ ఉత్కంఠభరితమైన దర్యాప్తు చుట్టూ కథ సాగనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో చీకటిలో పనిచేస్తున్న ఓ మిస్టీరియస్ దుష్టశక్తిని కూడా పరిచయం చేసింది. ఆకట్టుకునే విజువల్స్, షార్ప్ ఎడిటింగ్, సస్పెన్స్‌తో కూడిన నెరేషన్ ప్రేక్షకుల్లో నిరంతరం టెన్షన్‌ను పెంచుతున్నాయి. ‘అమ్మాయి’, ‘అదృశ్యం’, ‘అన్వేషణ’ అనే పదాలను ఉపయోగిస్తూ సినిమా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగనుందని ఆసక్తికరంగా వెల్లడించారు. శ్రీచరణ్ పాకాల అందించిన థంపింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భయాన్ని, ఉత్కంఠను మరింత పెంచింది.

ఈ గ్లింప్స్‌లో రాహుల్ విజయ్‌ను ఓ సీన్సియర్‌ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేశారు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆర్చన అయ్యర్ కనిపించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు మిస్టరీని మరింత పెంచుతున్నాయి. ఇక చివర్లో వచ్చే చిల్లింగ్ రివీల్.. అసలు కథ ఏమిటనే ఆసక్తిని ప్రేక్షకుల్లో పెంచుతోంది. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కూడిన డార్క్ థ్రిల్లర్‌గా ‘AH’ తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. అక్టోబర్ 9, 2026న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచబోతుంది.

ఇవి కూడా చదవండి





మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *