పెంటాస్ (Pentas): సీతాకోకచిలుకలను, తేనెటీగలను విపరీతంగా ఆకర్షించే మొక్క పెంటాస్. దీని లేత కాండం చివరలను 4 అంగుళాల మేర కత్తిరించి, దిగువ భాగాన్ని తేమ నేలలో లేదా కోకోపీట్ కలిపిన కుండీలలో నాటాలి. దాదాపు రెండు వారాల్లోనే ఇవి తేలికగా వేర్లు తొడుగుతాయి. ఎరుపు, ఊదా, పింక్, తెలుపు రంగుల పూల గుత్తులతో ఏడాది పొడవునా పూస్తూనే ఉంటాయి.