Headlines

వైస్ కెప్టెన్‌గానే ఉన్నా అందరికంటే తక్కువ మ్యాచ్ ఫీజు.. వైభవ్‌కే ఎందుకిలా.. రోజుకు ఎంతంటే? | Vice captain vaibhav suryavanshi duleep trophy match fee very low check bcci rule


Vaibhav Suryavanshi Duleep Trophy Match Fee: దులీప్ ట్రోఫీ 2026 విజేతగా ఈస్ట్ జోన్ నిలిచిన తర్వాత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఫైనల్ మ్యాచ్‌కు రోజుకు రూ.40,000 మాత్రమే లభించింది. అదే జట్టులోని పలువురు ఆటగాళ్లకు అంతకంటే ఎక్కువ మొత్తం అందింది.

అనుభవమే ప్రాతిపదిక..

వైభవ్‌కు తక్కువ ఫీజు రావడానికి అతడి హోదా కారణం కాదు. బీసీసీఐ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజుల నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు వారు ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల అనుభవాన్ని బట్టి చెల్లింపులు నిర్ణయిస్తారు. ఈ విధానంలో ఆటగాళ్లను మూడు విభాగాలుగా పరిగణిస్తారు.

మ్యాచ్‌ల సంఖ్యను బట్టి ఫీజు..

41 లేదా అంతకంటే ఎక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు రోజుకు రూ.60,000 చెల్లిస్తారు. 21 నుంచి 40 మ్యాచ్‌ల అనుభవం ఉన్న ఆటగాళ్లకు రోజుకు రూ.50,000 లభిస్తుంది. ఇక 0 నుంచి 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారికి రోజువారీ ఫీజు రూ.40,000గా ఉంటుంది.

కుమార్ కుశాగ్రకు రూ.50 వేలు..

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం మూడో కేటగిరీలో ఉన్నాడు. అందుకే దులీప్ ట్రోఫీ ఫైనల్ (Duleep Trophy Final) లో వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ అతడికి రోజుకు రూ.40,000 మాత్రమే దక్కింది. మరోవైపు పెద్దగా చర్చలో లేని కుమార్ కుశాగ్రకు రోజుకు రూ.50,000 అందింది. అంటే అనుభవం ఆధారంగా ఉన్న కేటగిరీనే ఈ తేడాకు కారణం.

ఇక ఇషాన్ కిషన్ సహా ఈస్ట్ జోన్‌లోని ఎనిమిది మంది ఆటగాళ్లకు రోజుకు రూ.60,000 చొప్పున మ్యాచ్ ఫీజు లభించింది. వైభవ్‌కు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు, జట్టులోని వైస్ కెప్టెన్ బాధ్యతలతో సంబంధం లేకుండా బీసీసీఐ ఫస్ట్ క్లాస్ ఫీజు నిబంధనల ప్రకారమే చెల్లింపు జరిగింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *