Headlines

OTT Movie: వరుసగా అనాథల హత్యలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. పిచ్చెక్కించే ట్విస్టులు | Bharat Crime Investigation Thriller Panchanama Web Series Is Now Streaming On ZEE 5 OTT


ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విశాల్ ‘మకుటం’, మహారాజా హాస్టల్, కట్టాలన్, వరవు లాంటి చిత్రాలుతో పాటు కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం అందజేస్తున్నాయి. అయితే ఇందులో ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రిలీజ్ కు ముందే ఈ సిరీస్ నుంచి వచ్చిన కంటెంట్ ఇంట్రెస్ట్ గా ఉండడంతో ఈ సిరీస్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 11) అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలు, ఆసక్తికరమైన సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ వెబ్ సిరీస్ ఈ వీకెండ్ లో బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన జయరాం అలియాస్ జై కష్టపడి చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. మరో అనాథ అయిన ఆదిని కూడా తన తమ్ముడిలానే భావిస్తూ సాయం చేస్తుంటాడు. అయితే, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఆది ఓ రోజు హాస్టల్‌‌లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపిస్తాడు. పోస్టుమార్టంలో ఇది నార్మల్ డెత్ అనే వస్తుంది. అయితే ఆది చనిపోయిన రోజే మరో ముగ్గురు అనాథలు కూడా వేర్వేరు ప్రమాదాల్లో మరణించడం పోలీసులను షాకింగ్ కు గురి చేస్త్ఉంది. దీంతో ఈ నాలుగు మరణాల వెనుక ఏదో మిస్టరీ ఉందని భావిస్తాడు జై. పర్సనల్‌గా తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.


ఇవి కూడా చదవండి



ఈ క్రమంలో కేస్ డెప్త్ లోకి వెళ్లే కొద్దీ అనాథలందరిది ప్రమాదాలు కావని హత్యలని తెలుస్తుంది. మరి ఈ మిస్టరీయస్ మర్డర్స్ చేస్తున్నదెవరు? అసలు ఆ కిల్లర్ అనాథలనే ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ వరుస మర్డర్స్‌కు ఓ డాక్టర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ చూడాల్సిందే. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సిరీస్ పేరు పంచనామా. ప్రముఖ యాంకర్, నటి ఉదయ భాను ఈ సిరీస్‌తో నిర్మాతగా మారడం విశేషం. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ‘పంచనామా’లో భరత్ శ్రీనివాసన్‌తో పాటు శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శివాజీ రాజా మారుతి పాత్రలో, మేధా రెడ్డి ధరణిగా, చరణ్ బాబు ఆదిగా, రూప లక్ష్మి పుష్పవల్లిగా, రాధిక ప్రీతి దేవకిగా, సూర్య హరిగా, శ్రీజ దివ్యగా కనిపించనున్నారు. ప్రస్తుతం పంచనామా వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

జీ5లో పంచనామా వెబ్ సిరీస్..

పంచనామా వెబ్ సిరీస్ ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *