Headlines

అవాంఛిత రోమాల సమస్యకు చెక్.. లోపలి నుంచి హార్మోన్లను సమతుల్యం చేసే సహజ చిట్కాలు! | Unwanted Facial Hair in Women: Can Diet and Hormonal Balance Help Reduce It?


మహిళల్లో పెదవులపై, గడ్డం భాగంలో వచ్చే అవాంఛిత రోమాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తుంటాయి. వీటిని తాత్కాలికంగా తొలగించడానికి చాలామంది థ్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ ఉపయోగిస్తారు, కానీ ఇవి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ప్రముఖ న్యూట్రిషియనిస్ట్ సోనియా నారంగ్ తెలిపిన వివరాల ప్రకారం..

అవాంఛిత రోమాలకు అసలు కారణం ఏమిటి?

మహిళల శరీరంలో సాధారణంగా చాలా తక్కువ మోతాదులో ఆండ్రోజెన్ ఉంటుంది. అయితే హార్మోన్ల అసమతుల్యత, లైఫ్‌స్టైల్ మార్పులు లేదా PCOD/PCOS వంటి సమస్యల వల్ల శరీరంలో ఈ ఆండ్రోజెన్ స్థాయిలు పెరిగినప్పుడు గడ్డం, పెదవులపై నల్లటి ఒత్తైన వెంట్రుకలు రావడం ప్రారంభమవుతాయి. బాహ్యంగా చేసే చికిత్సలు కేవలం పైపైన ఉన్న వెంట్రుకలను మాత్రమే తీస్తాయి తప్ప, లోపలి హార్మోన్ల సమస్యను తగ్గించలేవు.

లోపలి నుండి సమస్యను తగ్గించే పోషకాహార చిట్కాలు:

స్పియర్‌మింట్ టీ :

ఇవి కూడా చదవండి



న్యూట్రిషియనిస్ట్ సోనియా నారంగ్ ప్రకారం.. రోజూ 1 నుండి 2 కప్పుల స్పియర్‌మింట్ టీ తాగడం వల్ల శరీరంలో ఉప్పొంగే ఆండ్రోజెన్ హార్మోన్ల ప్రభావం తగ్గుతుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేసి ముఖంపై వెంట్రుకల ఎదుగుదలను గణనీయంగా తగ్గిస్తుంది.

అవిసె గింజలు :

అవిసె గింజల్లో లిగ్నన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అదనపు టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో ఒక చెంచా పొడి చేసిన అవిసె గింజలను తీసుకోవడం శ్రేయస్కరం.

ఫైటోఈస్ట్రోజెన్ రిచ్ ఫుడ్స్:

శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచేందుకు సోయా ఉత్పత్తులు, చిక్కుళ్లు, ధాన్యాలు మరియు నట్స్ వంటి ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇవి హార్మోన్ల అసమతుల్యతను నివారిస్తాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరం:

అధిక చక్కెర, మైదా, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి హార్మోన్ల సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి సమతులాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.

బాహ్య సౌందర్య చికిత్సల కంటే పోషకాహారం ద్వారా శరీరంలో హార్మోన్లను సహజంగా సమతుల్యం చేసుకోవడమే అవాంఛిత రోమాల నివారణకు నిజమైన, శాశ్వతమైన పరిష్కారం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *