Headlines

ఆ నలుగురిని ఇలా తొక్కిపడేశావేంది గంభీర్.. ఇకపై టీమిండియాలో చోటు కష్టమేగా..? | From rajat patidar to mohammed shami and krunal pandya including these 4 team players may not enter in team india gautam gambhir era bhuvneshwar kumar


Team India Selection: గౌతమ్ గంభీర్ టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి. అయితే రజత్ పాటిదార్, మహ్మద్ షమీ, క్రుణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లకు జాతీయ జట్టులో స్థానం దక్కడం లేదు. ముఖ్యంగా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనలు చేసిన ఆటగాళ్ల విషయంలో సెలక్షన్ విధానంపై చర్చ సాగుతోంది. షమీ చివరిసారి మార్చి 2025లో న్యూజిలాండ్‌పై భారత్ తరపున ఆడగా, క్రుణాల్ ఐపీఎల్ 2026 (IPL 2026)లో 226 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించాడు. భువనేశ్వర్ కూడా పాత లయను అందుకున్నప్పటికీ పునరాగమనం చేయలేకపోయాడు.

పాటిదార్‌కు మళ్లీ అవకాశం ఎప్పుడు?

మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పటిదార్ IPLతో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శనలు చేశాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. అయినప్పటికీ టీమ్‌ఇండియాలో అతనికి తిరిగి అవకాశం లభించడం లేదు. దీంతో అతని ఎంపికపై అభిమానుల్లో చర్చ కొనసాగుతోంది.

ఎక్కువమంది చదివినది: Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

ఇవి కూడా చదవండి



షమీకి తలుపులు మూసుకుపోయాయా..?

2023 వన్డే వరల్డ్ కప్ (2023 ODI World Cup)లో అద్భుత బౌలింగ్‌తో గుర్తింపు పొందిన మహ్మద్ షమీ ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. మార్చి 2025లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌నే భారత్ తరపున అతని చివరి ప్రదర్శనగా నిలిచింది. వయసు, ఫిట్ నెస్ అంశాలను దృష్టిలో పెట్టుకుని యువ పేసర్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.

క్రుణాల్ గణాంకాలు బలంగానే..

క్రుణాల్ పాండ్యా IPL 2026లో ఆర్సీబీ తరపున మంచి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. తొమ్మిది ఇన్నింగ్స్ ల్లో 145.80 స్ట్రైక్ రేట్ తో 226 పరుగులు సాధించడంతో పాటు 14 వికెట్స్ తీశాడు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌కు బ్యాట్, బాల్ రెండింటితోనూ ఉపయోగపడే సామర్థ్యం ఉన్నప్పటికీ టీమ్‌ఇండియా ఎంపికలో చోటు దక్కడం లేదు.

ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!

భువనేశ్వర్ పునరాగమనం ఎప్పుడో?

ఒకప్పుడు భారత పేస్ దళంలో కీలక బౌలర్‌గా ఉన్న భువనేశ్వర్ కుమార్‌కు 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి పాత రిథమ్ సాధించినప్పటికీ సెలెక్టర్స్ నుంచి అవకాశం రాలేదు. మరోవైపు టీమ్‌ఇండియా పేస్ అటాక్ లో జస్ప్రీత్ బుమ్రాతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ యాదవ్ వంటి యువ పేసర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలు పెరిగినప్పటికీ, ఈ నలుగురి పునరాగమనం మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. రజత్ పటిదార్, మహ్మద్ షమీ, క్రుణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌ల విషయంలో భవిష్యత్ టీమ్ సెలక్షన్‌లో మార్పు వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *