Headlines

Bigg Boss : ఏడిపించేసిన బిగ్ బాస్.. 20 ఏళ్ల ప్రయాణంలో అందమైన జంట.. ఒక్క వీడియోతో గుండెలు పిండేశాడుగా.. | Bigg Boss 20 Legacy Shares Sidharth Shukla and Shahnaz Gill Memories Video Goes Viral, Netizens Break Down


బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 20 ప్రారంభమై వారం రోజులే.. అయినప్పటికీ ఒక్క ఎపిసోడ్ తో సోషల్ మీడియా మొత్తం హైలెట్ అయ్యింది. అడియన్స్, కంటెస్టెంట్స్ సహా అందరినీ కదిలించింది ఒక్క వీడియో. సెప్టెంబర్ 9న ప్రసారమైన ఆ ఎపిసోడ్ బిగ్ బాస్ 20 ఏళ్ల ప్రయాణాన్ని ఒక వీడియో ద్వారా చూపించింది. తమ ప్రత్యేకమైన వ్యక్తిత్వాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఎందరో ప్రముఖ కంటెస్టెంట్ల తాలూకు కొన్ని దృశ్యాలను ఇందులో చూపించారు. ఈ లెగసీ వీడియోలో బిగ్ బాస్ అత్యంత అందమైన జంట అయిన సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ ఇద్దరికి సంబంధించిన అందమైన క్షణాలను చూపించారు. సిద్నాజ్ పేరుతో గుర్తుండిపోయే క్షణాలను చూసి కంటెస్టెంట్స్, అటు ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. అందులో సిద్ధార్థ్ కోపం, ఆట తీరుతోపాటు షెహనాజ్ వద్ద చేసిన అల్లరి.. అలాగే షెహనాజ్ అల్లరి, సిద్ పై ప్రేమ ఇలా.. ఎన్నో గుర్తుండిపోయే క్షణాలు చూపించారు.

ఎక్కువమంది చదివినవి : ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. చివరకు చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.. ప్రేమ కన్నీళ్లు..

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాత జ్ఞాపకాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు నెటిజన్స్. ఈ వీడియో తమను ఏడిపించిందని.. కన్నీళ్లు తెప్పించాయని అంటున్నారు. దీంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతూ.. “నేను దీనికి సిద్ధంగా లేను. నా ఇద్దరినీ మళ్లీ కలిసి చూడటానికి నేను సిద్ధంగా లేను… ఇది ఇప్పటికీ బాధిస్తోంది, ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుంది. నేను ఇప్పటికే ఏడుస్తున్నాను… బిగ్ బాస్, మీరెందుకు ఇలా చేయాల్సి వచ్చింది?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తనకు మళ్లీ #SidNaaz హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించే అవకాశం లభించిందని మరో అభిమాని కామెంట్ చేశారు. షెహనాజ్ అమాయకత్వం, సిద్ ప్రేమ తమను మర్చిపోనివ్వడం లేదని అంటున్నారు.

ఎక్కువమంది చదివినవి : Allari Naresh: అతడు ఒక కంప్లీట్ యాక్టర్.. డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అద్భుతంగా చేస్తాడు.. అల్లరి నరేష్.

బిగ్ బాస్ సీజన్ 13 ఇప్పటికీ ఒక అందమైన సీజన్ అనే చెప్పాలి. ఇందులో సిద్ధార్థ్, షెహనాజ్ ప్రేమ, అలాగే సిద్ధార్థ్ మాస్ అండ్ మెచ్యూర్డ్ యాటిట్యూడ్ జనాలను కట్టిపడేశాయి. అందుకే బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా అతడిని నిలబెట్టారు అడియన్స్. బిగ్ బాస్ 13 తర్వాత కూడా సిద్ధార్థ్, షెహనాజ్‌ల స్నేహం కొనసాగింది. ఈ జంటను ఫ్యాన్స్ ముద్దుగా సిద్నాజ్ అని పిలుచుకునేవారు. అయితే అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలోనే 2021 సెప్టెంబర్ 2న సిద్దార్థ్ గుండెపోటుతో కన్నుమూశారు. అప్పుడు అతడి వయసు కేవలం 40 సంవత్సరాలు మాత్రమే. సిద్ధార్థ్ మరణంతో షెహనాజ్ చాలా కాలం మానసికంగా కుంగిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్..

సిద్నాజ్ వీడియో..

ఎక్కువమంది చదివినవి : Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *