పారిశ్రామికవేత్త హర్ష గోయంక ప్రారంభించిన కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన లగ్జరీ ఏసీ బస్సు తిరువనంతపురం నుండి ఎర్నాకులం మధ్య ఏసీ బస్సు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన తన ఎక్స్ ఖాతాలో దీన్ని గూర్చి ఇది భారతీయ రవాణా వ్యవస్థలోనే ఒక విప్లవాత్మకమైన అద్భుతమైన మార్పు అని ఆయన ప్రశంసించారు. విమానా తరహా సీటింగ్స్ సౌకర్యం పర్సనల్ ఏసి వెంట్స్ వంటి అత్యాధునికమైన సౌకర్యాలు ఈ బస్సులో ఉన్నాయని కొనియాడారు
ఇలాంటి సౌకర్యవంతమైన ప్రయాణం సరసమైన ధరల్లో సామాన్య ప్రయాణికుడికి అందించాలని ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం ఈ సేవలను సామాన్యుడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.
ఇంత విలాసవంతమైన ప్రజా రవాణా సౌకర్యాన్ని కల్పించిన కేరళ ప్రజా రవాణా వ్యవస్థను ఆయన కొనియాడారు. అదేవిధంగా ఈ బస్సులో లగేజీ పెట్టుకోవటానికి విమాన తరహా ఏరో డైనమిక్ ఓవర్హెడ్ బీన్స్ కూడా ఉన్నాయి.
ఇలాంటి విలాసవంతమైన సౌకర్యాలు ప్రైవేట్ ట్రావెల్స్ లో మనకు చాలా ఎక్కువ ధరలకు లభ్యమవుతాయి
కానీ కేరళ ప్రజా రవాణా వ్యవస్థ దీన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చింది
తిరువనంతపురం నుండి ఎర్నాకులం మధ్య నిత్యం ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరం.
కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవేటు వాహనదారులకు కంటగింపుగా ఉంది సామాన్య ప్రజలను, సొంత వాహనాల్లో ప్రయాణించే వారిని సైతం ఈ బస్సు ఆకర్షిస్తుంది
‘Business Class’ buses now in Kerala! https://t.co/ULLYBknvO4
— Harsh Goenka (@hvgoenka) September 11, 2026
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..