Headlines

Allari Naresh: ఆ టైంలో నాన్న ఎంత నరకం అనుభవించారో కళ్లారా చూశా.. తండ్రి ఈవీవీని గుర్తు చేసుకున్న అల్లరి నరేష్ | Allari Naresh Remembers His Father EVV Satyanarayana At Ramba Oorvasi Menaka Pre Release Event


అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ లో సురభి హీరోయిన్ గా నటించింది. అలాగే రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు రిలీజ్ ముందే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘రంభ ఊర్వశి మేనక’ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 04) న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్నాడు అల్లరోడు. ఇదే క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నాడు. కాగా తాజాగా జరిగిన ‘రంభ ఊర్వశి మేనక’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ హీరో. ఇదే క్రమంలో తన తండ్రి, దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణను కూడా మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. అలాగే ఈ సినిమా నిర్మాత, హీరో అక్కినేని నాగార్జున గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నేను చిన్నప్పటి నుంచి అక్కినేని నాగార్జున గారికి ఫ్యాన్ ని. ఆయనతో కలిసి కోస్టార్ గా ‘నా సామిరంగా’ సినిమా చేశాను. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో హీరోగా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత నిమ్మకాయల ప్రసాద్ నాకు ‘అల్లరి’ సినిమా నుంచే తెలుసు. నేను సినిమా కథల విషయంలో ఎప్పుడైనా డైలమాలో ఉన్నప్పుడు ఆయన సలహా తీసుకుంటాను. ఆయన ‘రంభ ఊర్వశి మేనక’ కథ విని, చాలా బాగుందని, అన్నపూర్ణ స్టూడియోస్ లో చేద్దామని సూచించారు. ఇక నిర్మాత రాజేష్ దండాతో ఎప్పటి నుంచో ఒక కామెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి ఈ సినిమా నిర్మించారు” అని చెప్పారు. డైరెక్టర్ చంద్ర మోహన్ చింతాడ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక సినిమా ఆడకపోతే మళ్లీ అవకాశం రావడం చాలా కష్టం. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ‘చెవిలో పువ్వు’ సినిమా తర్వాత మా నాన్న ఒక ఏడాది ఖాళీగా ఉన్నప్పుడు చూశాను. రోజూ ఎంత నరకం అనుభవించేవారో నేను కళ్లారా చూశాను. నాకంటే చంద్ర మోహన్ కోసం ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలనేది నా బలమైన కోరిక’ అని చెప్పుకొచ్చారు అల్లరి నరేష్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *