Headlines

Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు | Balakrishna’s Dedication: Despite Knee Surgery, NBK Plans to Resume Shooting Soon video tv9d – Entertainment Videos in Telugu


నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి ఎన్టీఆర్ నుంచి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. రీసెంట్‌గా ‘నీ’ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే ‘బాబాయ్-అబ్బాయ్’ షూటింగ్ లో, ఆ తరువాత ‘భార్యాభర్తల బంధం’ చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై ‘విజయేంద్రవర్మ’ షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య తనకు బాగయిందని, నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ ‘పల్లెటూరి పిల్ల’ మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. ‘సర్దార్ పాపారాయుడు’ షూటింగ్ లో మరోమారు అదే చేయికి గాయమయింది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం వాటిల్లరాదని ఎన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు. అదీ ఎన్టీఆర్ డెడికేషన్. ఆ అంకితభావమే బాలయ్యకూ అబ్బిందని అంటున్నారు సినీజనం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్

తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం

Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్‌’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది!

ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *