Headlines

Bigg Boss: ఒకప్పుడు సైఫ్- కరీనాల పెళ్లిలో గిన్నెలు కడిగాడు.. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.. ఎవరంటే? | Bigg Boss 20 : Asif Khan’s Inspiring Journey From Washing Dishes At Saif Kareena Wedding To Star Actor


బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ లాంఛ్ జరిగింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరగ్గా మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ హిందీ సీజన్ 20 గ్రాండ్ లాంఛ్ కూడా ఘనంగా జరిగింది. ఇక్కడ కూడా మొత్తం 16 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగు పెట్టారు. అందులో ప్రముఖ సెలబ్రిటీలు, బుల్లితెర నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ 20లో అడుగుపెట్టిన వారిలో నటుడు ఆసిఫ్ ఖాన్ ఒకరు. ఎందుకంటే అతను చాలా కష్టపడి ఈ స్థాయికి వ చ్చాడు. ఓ సినిమా కథకు మించిన మలుపులు, ట్విస్టులు అతని జీవితంలో ఉన్నాయి. ఇదే ఆసిఫ్ ఒకప్పుడు వెయిటర్‌గా పనిచేసేవాడు, కానీ కఠోర శ్రమతో తన తలరాతను, జీవితాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రముఖ నటుడిగా అందరి నోళ్లలో నానుతున్నాడు.

చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి కరీనా కపూర్‌ల పెళ్లిలో ఆసిఫ్ ఖాన్ వెయిటర్‌గా కూడా పనిచేశాడు. అంతేకాదు ఆ పెళ్లిలో గిన్నెలు కూడా కడిగాడు. అప్పుడు సైఫ్-కరీనాలను కలవాలని అనుకున్నాడు ఆసిఫ్. కానీ ఆ సమంయలో వారిని కలవడానికి అతనికి అనుమతి లభించలేదు. ఆసిఫ్ ఖాన్ తన కెరీర్‌లో అనేక సీరీస్‌లు, సినిమాలలో నటించారు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో లో వచ్చిన ‘పంచాయత్’ వెబ్ సీరీస్ ఆసిఫ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సీరీస్‌లో అతను పోషించిన గణేష్ అనే పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. నేటికీ చాలా మంది ఆసిఫ్ ను గణేష్ అనే పేరుతోనే గుర్తు పెట్టుకుంటారు.

ఇవి కూడా చదవండి



అయితే ఆసిఫ్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పిన దాని ప్రకారం – మొదట్లో ముంబైకి వచ్చినప్పుడు, డబ్బు సంపాదించడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి అతను వెయిటర్‌గా పనిచేశాడు. చాలా హోటళ్లలో పనిచేశాడు. 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి కరీనా కపూర్‌ల వివాహ రిసెప్షన్ తాజ్ హోటల్‌లో జరిగింది, ఆ సమయంలో ఆసిఫ్ తాజ్‌లో పనిచేస్తున్నాడు. అప్పుడు అతను కరీనా-సైఫ్‌లను కలవవచ్చా అని మేనేజర్‌ను కూడా అడిగాడు, కానీ మేనేజర్ అతనికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆసిఫ్ నిరాశగా వెనుదిరిగాడు. వెయిటర్ గా సైఫ్- కరీనాల పెళ్లిలో గిన్నెలు కూడా కడిగాడు. అలాంటిది తన కఠోర శ్రమతో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు.

బిగ్ బాస్ షోలో ఆసిఫ్ ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *