Headlines

Bigg Boss 10: బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్‌లోకి ఆ హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రచ్చే | Will Seerat Kapoor enter the Bigg Boss 10 house as a wild card entry


బిగ్ బాస్ సీజన్ 10 రసవత్తరంగా సాగుతుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తెగ సందడి చేస్తున్నారు. మొత్తంగా 16 మందిని హౌస్ లోకి పంపించారు. వారిలో పది మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే తొలి రోజు నుంచే హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, విభేదాలు బయటపడ్డాయి. గొడవలు, వాదనలతో హడావిడి చేస్తున్నారు. కాగా తొలి వారమే మిడ్ వీక్ లో హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేశారు. కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్జే చరణ్ తొలి వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అలాగే ఈ వారం చివరిలో మరొకరు కూడా హౌస్ నుంచి బయటకు వచేస్తున్నారని తెలుస్తుంది.

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

హౌస్ లో రెండు టీమ్స్ డివైడ్ చేశారు. రెడ్ టీమ్, బ్లూ టీమ్ గా కంటెస్టెంట్స్ డివైడ్ గేమ్ ఆడుతున్నారు. కాగా రెండు టీమ్స్ నుంచి హై రిస్క్ లో ఉండే కంటెస్టెంట్ ఎవరు అని బిగ్ బాస్ అడగ్గా.. మొదటి సారి రామ్ ప్రసాద్, ఆర్జే చరణ్ ఉన్నారు. వారిలో హౌస్ మేట్స్ ఓట్స్ ప్రకారం రామ్ ప్రసాద్ సేఫ్ అవ్వగా చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి రెండు టీమ్స్ మధ్య ఓ గేమ్ ఆడించి ఆడించి ఓడిపోయిన వారిని  హై రిస్క్ లో ఉంచారు. వారిలో అమన్ , చిత్ర రాయ్, సుధీర్ రెడ్డి ఉన్నారు. ఫైనల్ గా చిత్ర రాయ్ ఓడిపోయి బయటకు వచ్చేయనుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి



BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

ఇదిలా ఉంటే ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈసారి వైల్డ్ కార్డు ద్వారా ఈసారి మరింత మంది కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. లేడీ కంటెస్టెంట్ల కోటాలో ప్రముఖ హీరోయిన్ సీరత్ కపూర్ పేరు బాగా వినిపిస్తోంది. ఆమెతో పాటు ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ ఫేమ్ సోనియా, ఆషిక, ప్రముఖ సీరియల్ నటి సౌందర్య రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే జబర్దస్త్ కమెడియన్లు నూకరాజు, రాకింగ్ రాకేష్‌లను బిగ్ బాస్ టీమ్ సంప్రదించారని వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *