Headlines

Bigg Boss Telugu 10: అయ్యో ఎంత పనైంది! బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2.. ప్రభుత్వ ఉద్యోగానికి దూరమైన శ్రీకాకుళం కుర్రోడు | Bigg Boss Telugu 10: Is Rama Krishna Sacrificed Government Job Dream For Agnipariksha 2, Details Here


బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటే ముందు కామనర్స్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష సీజన్ 2 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కాంటెస్ట్ కు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అభిజిత్, బింధు మాధవి, నవదీప్ జడ్జీలుగా వ్యవహరించారు. అలాగే స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్టుగా వ్యవహరించింది. కాగా ఈ కాంటెస్ట్ కోసం వందలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వడపోత చేసి 15 మందిని ఎంపిక చేశారు. చివరకు వీరిలో ఆరుగురిని మాత్రమే మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించారు. అయితే అగ్నిపరీక్ష సీజన్ లో సత్తా చాటిన కొంతమందిని హౌస్ లోకి పంపించకుండా అన్యాయం చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో రాజకుమారి డయానా ఒకరు కాగా మరొకరు శ్రీకాకుళం కు చెందిన రామకృష్ణ. ‘అగ్ని పరీక్ష సీజన్ 2’ షో లో రోహిత్ తర్వాత ఆడియెన్స్ లో మంచి ఆదరణ దక్కించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే.. అది రామ కృష్ణ అని చెప్పవచ్చు. కాగా కాంటెస్ట్ ప్రారంభంలో రామ కృష్ణ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అసలు అతడిని ఆడిషన్స్ లో ఎందుకు సెలెక్ట్ చేశారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఉన్నట్లుండి జూలు విదిల్చాడీ శ్రీకాకుళం కుర్రాడు. చివరి మూడు ఎపిసోడ్స్ లో రామకృష్ణ ఆట, మాట తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో అతని మీద ఓవరాల్ గా పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. రామకృష్ణ కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిందే అని చాలా మంది గట్టిగా కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి ఆయనకు భారీ రేంజ్ లో ఓటింగ్ పడింది. కానీ ఈ శ్రీకాకుళం కుర్రాడిని దురదృష్టం వెంటాడింది. త్రుటిలో బిగ్ బాస్ ఆఫర్ కోల్పోయాడు.

కాగా రామకృష్ణను బిగ్ బాస్ హౌస్ లోకి పంపకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బిగ్ బాస్ టీం రికమండేషన్ కోటా లో వాళ్లకు కావాల్సిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపారని , ఇది అసలు కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న టేస్టీతేజా నిర్వహిస్తోన్న ఇంటర్వ్యూకు రామకృష్ణ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అగ్ని పరీక్ష సీజన్ లో తన జర్నీ గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడీ శ్రీకాకుళం అబ్బాయి. ‘కాగా రామకృష్ణ కి మొదటి నుంచి ఎలాగైనా పోలీస్ జాబ్ కొట్టాలనే కోరిక ఉందిట. అందకోసం అతను చేయని ప్రయత్నం అంటూ ఏది లేదట. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లే వాళ్లు అసలు ట్యాటూలు వంటివి వేసుకోకూడదు. అలాంటివి వేసుకుంటే పోలీస్ ఉద్యోగానికి అనర్హులని నిబంధనలు చెబుతున్నాయి.

అయితే ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎలా అయినా ఎంట్రీ ఇవ్వాలనే కసితో రామకృష్ణ తన ఒంటిపై ట్యాటు వేయించుకున్నాడు. ‘తు నా బ్రతుకు’ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీంతో ఇక తన పోలీస్ జాబ్ కల కలగానే మిగిలిపోయినట్టేనని టేస్టీతేజా ఇంటర్వ్యూ లో ఎమోషనల్ అయ్యాడు రామకృష్ణ. కాగా ఇతనికి ఇంకా బిగ్ బాస్ ఎంట్రీ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ద్వారా రామకృష్ణను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటారన్న అభిప్రాయలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి



Bigg Boss Telugu 10 Agnipar

Bigg Boss Telugu 10 Agnipariksha 2

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *