బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ‘ అగ్ని పరీక్ష సీజన్ 2’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంటెస్ట్ లో సత్తా చాటిన పలువురు సామాన్యులు ఇప్పుడు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోనే అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక వీరిని ఎదుర్కొనేందుకు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఒక లేడీ సెలబ్రిటీని హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ తెలుగు 10 టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. మరోవైపు ఆమె మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ భార్య సతీమణి, ప్రముఖ సీరియల్ నటి తేజస్విని గౌడ.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం తేజస్విని గౌడ సీరియల్స్ , టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తోన్న ‘ఆయాలి’ అనే సీరియల్ టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతోన్న
‘జగద్దాత్రి’ సీరియల్ కి ఇది రీమేక్. ఈ సీరియల్ కోసం తేజస్వినికి భారీగా రెమ్యునరేషన్ అందుతోంది. అందుకే ఈ సీరియల్ ని వదిలి రావాలంటే వారానికి 6 లక్షల రూపాయలు అడుగుతోంది తేజస్విని. వారానికి 6 లక్షలు అంటే, 15 వారాలకు గానూ 90 లక్షల వరకు రెమ్యూనరేషన్ అన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయట. మరి తేజస్విని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో అన్నది తెలియాలంటే గ్రాండ్ లాంఛ్ దాకా ఎదురు చూడాల్సిందే.
తేజస్విని గౌడ లేటెస్ట్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి