బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా జరుగుతోంది. సెప్టెంబర్ 06న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. అందులో 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కాగా, మరో ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటి మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆరుగురిలో షాలినీ పటేల్ ఒకరు. ఆస్ట్రేలియాలో ఉండే ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఎంపికైంది. తన దైన ఆట, మాట తీరుతో జడ్జీలతో పాటు బిగ్ బాస్ అభిమానులను ఇంప్రెస్ చేసింది. కాగా ‘అగ్ని పరీక్ష 2’ కాంటెస్ట్ లో షాలినీ ని చూసినప్పుడు చాలా మంది ఈ అమ్మాయికి పొగరు, యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకున్నారు. అసలు ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి రాకూడదు అని కూడా చాలా మంది కోరుకున్నారు. రివ్యూయర్స్ తో పాటు నెటిజన్లు కూడా షాలినీపై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఎప్పుడూ యారోగెంట్ గా కనిపించే షాలినీ జీవితంలో కొన్ని విషాద సంఘటనల గురించి చాలా మందికి తెలియదు. బహుశా వాటి కారణంగానే ఆమె ఎప్పుడూ సీరియస్ గా కనిపిస్తుందేమోనని నెటిజన్లు అభిప్రాయపడుఉతన్నారు.
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2’ పూర్తి అయ్యాక, బిగ్ బాస్ 10 లోకి ఎంట్రీ ఇచ్చేముందు షాలినీ పటేల్ ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది షాలిని. ఇదే క్రమంలో తన జీవితంలో జరిగిన విషాదాలను కూడా షేర్ చేసుకుంది. ‘నాకు 8 ఏళ్ల వయస్సులోనే అమ్మ చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు నాన్న కూడా చనిపోయాడు. నేను ఈ విషయాన్ని అగ్ని పరీక్ష కాంటెస్ట్ లో చెప్పలేదు. ఎందుకంటే సానుభూతి తో ఓట్లు సంపాదించడం నాకు ఇష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది షాలిని. ప్రస్తుతం షాలినీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ విషయంలో కూడా కొందరు షాలినీని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సానుభూతికి ఉపయోగపడుతుందనే షాలినీ వీడియోలు బయటకు వచ్చాయని కొందరు షాలినీ ని విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బిగ్ బాస్ హౌస్ లో షాలినీ పటేల్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.