Headlines

Bigg Boss Telugu 10: నాగార్జున అంటే చాలా ఇష్టం.. బిగ్‌బాస్ 10లోకి నన్ను తీసుకోండి.. సీరియల్ హీరోయిన్ రిక్వెస్ట్ | Bigg Boss Telugu 10: Brahmamudi Actress Deepika Rangaraju Wants To Enter The Nagarjuna Reality Show

Bigg Boss Telugu 10: నాగార్జున అంటే చాలా ఇష్టం.. బిగ్‌బాస్ 10లోకి నన్ను తీసుకోండి.. సీరియల్ హీరోయిన్ రిక్వెస్ట్ | Bigg Boss Telugu 10: Brahmamudi Actress Deepika Rangaraju Wants To Enter The Nagarjuna Reality Show


బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ మళ్లీ వచ్చేస్తోంది. ఈసారితెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళం.. ఇలా ప్రధాన భాషల్లో ఒకేసారి ఈ రియాలిటీ షో గ్రాండ్ గా లాంఛ్ కానుంది. ఇక తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా ల్యాండ్ మార్క్ సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే కామన్ కంటెస్టెంట్ల ఎంపిక కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా తెలుగు బుల్లితెరపై స్టార్ నటిగా వెలుగొందుతోన్న ఒక అందాల తార బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని ఉందంటూ తన మనసులోని కోరికను బహిరంగంగానే బయట పెట్టింది. అంతేకాదు ఒక వేళ బిగ్ బాస్ లోకి వెళితే విన్నర్ గానే తిరిగి వస్తానంటూ ధీమా వ్యక్తం చేసింది. ఆ నటి మరెవరో కాదు ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఎప్పుడూ చలాకీగా, తింగరిగా కనిపించే బ్రహ్మముడి నటి కావ్య అలియాస్ దీపికా రంగరాజు.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ రియాలిటీ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది దీపిక . ‘చాలామంది నన్ను బిగ్ బాస్‌కు వెళ్తారా అని అడుగుతుంటారు. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను పిలవాలని నిజంగానే కోరుకుంటున్నాను. ఒకవేళ బిగ్ బాస్‌ కు వెళ్లితే కేవలం పాల్గొనడానికే కాదు. విజేతగా నిలిచి కప్పుతోనే బయటకు రావాలి. నాగార్జున గారు నా చేతిని పైకెత్తి విన్నర్ అని ప్రకటించే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కానీ బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు. కానీ అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా వెళ్తాను. బిగ్ బాస్ షో అన్నాక గొడవలు, వాదనలు, ఎమోషన్స్ అన్నీ సహజమే. అయితే నేను మాత్రం అలాంటి వ్యక్తిని కాదు. స్కూల్‌లో అయినా, కాలేజీలో అయినా పెద్దగా ఎవరితో గొడవ పడలేదు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినా పరిస్థితులకు తగ్గట్టు గా అప్పటికప్పుడ అడ్జస్ట్ అయిపోతాను. ఎదుటివాళ్లు ఏం చేసినా ఎక్కువగా పట్టించుకోను’ అని దీపిక చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి



ఇక బిగ్ బాస్ హోస్ట్, హీరో నాగార్జున అంటే తనకెంతో ఇష్టమో స్వయంగా చెప్పుకొచ్చింది దీపిక. ‘నాకు నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం. నా వయసు వాళ్లకు విజయ్ దేవరకొండ లాంటి హీరోలపై క్రష్ ఉంటుంది. కానీ నాకు మాత్రం నాగార్జున గారంటేనే ఇష్టం. ఆయన చార్మ్ నన్ను ఆకట్టుకుంది’ అని చెప్పుకొచ్చిందీ బ్రహ్మముడి నటి.

ఇన్ స్టా గ్రామ్ లో దీపికా రంగరాజు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *