Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లోకి మరో ఇద్దరు జబర్దస్త్ స్టార్ కమెడియన్స్! ఆ క్రేజీ హీరోయిన్ కూడా ఎంట్రీ! | Bigg Boss Telugu 10: 8 Wild Card Contestants Including Two Jabardasth Comedians To Enter Nagarjuna Reality Show


బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో 10 మంది సెలబ్రిటీలు కాగా మరో ఆరుగురు కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ 16 మంది కంటెస్టెంట్స్ లో సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ (బ్లూ టీం వర్సెస్ రెడ్ టీమ్) అంటూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇక కంటెస్టెంట్స్ కూడా ఎవరికి వారు తమదైన శైలిలో గేమ్ స్టార్ట్ చేశారు. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటుతూ తమ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని కూడా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా బిగ్ బాస్ 10 ప్రారంభమై నాలుగు రోజులే అయ్యింది. కాబట్టి కంటెస్టెంట్ల బలాల, బలహీనతలపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం. అయితే ప్రస్తుతం మాత్రం హీరో అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్ తన యారోగేంట్ ప్రవర్తనతో హౌస్ లో హైలైట్ అవుతున్నాడు. మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నది మాట్లాడుతున్నాడు. ఆఫ్ కోర్స్ అతను ఎక్కువగా రోహిత్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడనే విమర్శలు ఉన్నా త్రిగుణే మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నాడని ఆడియెన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ ఉంటుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ 10లో కూడా మంచి స్టఫ్ ఉన్న కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకురానున్నారని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రక్రియ పూర్తైందని ఈసారి మొత్తం 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకురానున్నారని సమాచారం.

బిగ్ ‘అగ్ని పరీక్ష 2’ లో సత్తా చాటిన దీపక్ , మితిలేష్ , రామకృష్ణ , అపూర్వ లలో ఇద్దరు మెయిన్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారట. వీరిలో రామకృష్ణ రావడం పక్కా అని తెలుస్తోంది. బిగ్ బాస్ ఆడియెన్స్ కూడా రామకృష్ణ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా రావాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత మితిలేష్ కూడా రేసులో ఉన్నాడని, అపూర్వ కు ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఎక్కువ భాగం లేడీసే రానున్నారని టాక్. ప్రముఖ హీరోయిన్ సీరత్ కపూర్ తో పాటు సోనియా (మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఫేమ్), ఆషిక వంటి వారు ఈసారి హౌస్ లోకి రానున్నారని టాక్. వీరితో పాటు సౌందర్య రెడ్డి అనే సీరియల్ హీరోయిన్ కూడా వైల్డ్ కార్డు గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇక మేల్ కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్ లను బిగ్ బాస్ టీమ్ సంప్రదించిందని టాక్. వీరు కూడా బిగ్ బాస్ కు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై మరింత క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి



బిగ్ బాస్ 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *