Headlines

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బిగ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే…. | EPFO PF Withdrawal Rules Changed: New Rules for PF Advances, Contributions and Withdrawals

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బిగ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే…. | EPFO PF Withdrawal Rules Changed: New Rules for PF Advances, Contributions and Withdrawals


ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. పీఎఫ్ విత్ డ్రా నియమాల్లో కీలక మార్పులు చేసింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే పీఎఫ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా మీ బ్యాలెన్స్‌లో కొంత మొత్తం తీసుకోవచ్చనే విషయం తెలిసిందే. హెల్త్ ఎమర్జెన్సీ, పెళ్లి, పిల్లల చదువులు, ఇల్లు కొనుగోలు వంటి కారణాలతో పీఎఫ్ అమౌంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడే పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. వీటికి సంబంధించి తాజాగా పీఎఫ్ సంస్థ కొన్ని నిబంధనలు సడలించింది. గతంలో పీఎఫ్ అడ్వాన్స్ విత్ డ్రాకు 13 కేటగిరీలు ఉండగా.. ఇప్పుడు మూడుకు తగ్గించింది. దీంతో పాటు కాంట్రిబ్యూషన్స్, ఉద్యోగం తర్వాత పీఎఫ్ విత్ డ్రాలపై భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

జూన్ 29వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం 1952 పీఎఫ్ పథకం స్థానంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 2026 ప్రారంభించింది. ఇందులో పీఎఫ్ కాంట్రిబ్యూషన్, విత్ డ్రా రూల్స్ మార్చింది. ఇక నుంచి రూ.15 వేల కంటే ఎక్కువ జీతం పొందేవారు తమకు అవసరమైతే నెలవారీ కాంట్రిబ్యూషన్ పెంచుకోవచ్చు. నిబంధనల ప్రకారం తమ జీతంలో 12 శాతం పీఎఫ్‌కు అందించాలి. అంటే నెలకు రూ.1800 అందించాలి. అయితే అంతకంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ జమ చేయాలనుకుంటే స్వచ్చంధంగా చేయవచ్చు. అయితే ఉద్యోగి ఎక్కువ జమ చేస్తే.. యాజమాన్యం కూడా అదే మొత్తంలో చందా అందించాల్సి ఉంటుంది. అయితే అదనంగా అందించే ఈ విరాళాలను ఎప్పుడైనా మీరు నిలిపివేసుకోవడం లేదా తగ్గించుకోవడం వంటివి చేసుకోవచ్చు.

ఇక గతంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే 13 కేటగిరీలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆరోగ్యం, విద్య, వివాహం వంటి కేటగిరీలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం కింద మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో అర్హత గల మొత్తంలో 100 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే 12 నెలల పాటు పీఎఫ్ ఖాతాదారుడిగా కొనసాగి ఉండాలి. ఇక జీవితకాలంలో విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. ఇక ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ ఈఎంఐ, ఇల్లు కొనుగోలు, ఇల్లు పునరుద్దరణ వంటి అవసరాల కోసం జీవితకాలంలో 5 సార్లు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే 12 నెలల పాటు పీఎఫ్ సభ్యత్వం కలిగి ఉండాలి. ఇక ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత అమౌంట్ మొత్తం విత్ డ్రా చేసుకోలేరు. కేవలం 75 శాతం మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 12 నెలల తర్వాత మొత్తం అమౌంట్ తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *