Headlines

I’m Game Collections : దుల్కర్ ఈజ్ బ్యాక్.. ఐ యామ్ గేమ్ సినిమాతో బాక్సాఫీస్ షేక్.. టాక్సిక్ ఫస్డ్ డే కలెక్షన్లను మించిపోయి.. | Dulquer Salmaan Im Game Movie Box Office Start Beats Rocking Star Yash Toxic Movie First Day Collections


మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత గడ్డపై సత్తా చాటాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఐ యామ్ గేమ్ సినిమాతో మలయళీ అడియన్స్ ముందుకు వచ్చాడు ఈ హీరో. 2023లో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త తర్వాత దుల్కర్ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించగా.. రెండు రోజుల్లో రికార్డ్ బ్రేక్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా వసూళ్లు చార్టులలో అగ్రస్థానంలో లేనప్పటికీ, వాటిని తక్కువగా అంచనా వేయలేము. నివేదికల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు 2,714 షోలలో రూ. 5.05 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేరళలో అత్యధికంగా వచ్చినట్లు టాక్. ఒక్క మలయాళ వెర్షన్ మాత్రమే రూ. 4.30 కోట్లు రాబట్టగా, తెలుగు డబ్బింగ్ రూ. 0.65 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 0.10 కోట్లు రాబట్టినట్లు టాక్. దేశవ్యాప్తంగా మొత్తం ఆక్యుపెన్సీ 44%గా నమోదైంది.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఈ సినిమాకు కమర్షియల్ టాక్, రివ్యూస్ మిశ్రమంగా ఉన్నప్పటికీ మాత్రం అటు వసూళ్లు మాత్రం సరిగ్గానే వస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి అటు విమర్శకులు, ప్రేక్షకుల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. 2023లో రూ. 6.85 కోట్లతో మరింత బలమైన వసూళ్లతో ప్రారంభమైన ‘ కింగ్ ఆఫ్ కొత్త’ చిత్రాన్ని ఇది పూర్తిగా అధిగమించలేకపోయింది. అయినప్పటికీ, ‘ఐ యామ్ గేమ్’ చిత్రం దుల్కర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఐదు చిత్రాల జాబితాలో చేరింది. దీనికంటే ముందు ‘లక్కీ భాస్కర్’ (రూ. 7.35 కోట్లు), ‘కింగ్ ఆఫ్ కొత్త’ (రూ. 6.85 కోట్లు), ‘కురుప్’ (రూ. 5.60 కోట్లు) చిత్రాలు ఉన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఇక ఈ సినిమా ఒక్క రోజులోనే యష్ నటించిన టాక్సిక్ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ సినిమా మొదటి రోజు రూ. 5.05 కోట్లు వసూలు చేస్తుండగా, అప్పటికే తొమ్మిది రోజులుగా ప్రదర్శనలో ఉన్న యష్ కన్నడ బ్లాక్‌బస్టర్ అదే రోజు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగిందని సమాచారం. నిజానికి ఐ యామ్ గేమ్ సినిమా ఓనం సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సెప్టెంబర్ 3న రిలీజ్ అయ్యింది. ఇందులో ఆంథోనీ వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, కతిర్, వినయ్ ఫోర్ట్, పార్ట్ తివారీ ముఖ్యపాత్రలు పోషించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *