Headlines

IND vs SL 2nd Test: రిషబ్ పంత్ గాయంపై క్లారిటీ.. జైస్వాల్ గొడవపై కోచ్ ఏమన్నారంటే..? | Ind vs sl test rishabh pant injury update yashasvi jaiswal fight


IND vs SL 2nd Test: సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత జట్టు మొదటి రోజు తన పట్టు నిరూపించుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పటికీ, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడటం డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్ పెంచింది. లంక ఫాస్ట్ బౌలర్ లాహిరు కుమార విసిరిన వేగవంతమైన బంతి నేరుగా పంత్ ఎడమ చేతి మణికట్టు కింద బలంగా తాకింది. తీవ్ర నొప్పితో విలవిల్లాడిన పంత్, కేవలం 3 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

పంత్ ఫిట్‌నెస్‌పై బ్యాటింగ్ కోచ్ భరోసా..

తొలి రోజు ఆట ముగిసిన అనంతరం భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మీడియా ముందుకు వచ్చి పంత్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. పంత్ గాయం పెద్దది కాదని, అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని చెప్పారు. రెండో రోజు ఆటలో పంత్ తిరిగి బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించాలంటే లోయరార్డర్‌లో పంత్ విలువైన ఇన్నింగ్స్ ఆడటం జట్టుకు ఎంతో అవసరం. ఈ ప్రకటనతో భారత అభిమానులు, జట్టు మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకున్నాయి.

ఎక్కువమంది చదివినది: SL vs IND 2nd Test: శుభ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!

ఇవి కూడా చదవండి



మైదానంలో జైస్వాల్ వర్సెస్ ఫెర్నాండో.. వేడెక్కిన వాతావరణం..

ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో లంక పేసర్ అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో జైస్వాల్ వరుసగా మూడు బౌండరీలు బాది జోరు చూపించాడు. అదే ఓవర్ చివరి బంతికి ఫెర్నాండో అద్భుతమైన డెలివరీతో జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో బౌలర్ దూకుడుగా సెండ్-ఆఫ్ ఇవ్వగా, జైస్వాల్ కూడా వెనక్కి తగ్గకుండా తీవ్ర ఆగ్రహంతో బౌలర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై కోచ్ కోటక్ స్పందిస్తూ.. మైదానంలో దూకుడు సహజమే అయినా, జైస్వాల్ సహనం కోల్పోయి బౌలర్ దగ్గరకు అంత దూరం వెళ్లాల్సింది కాదని హితవు పలికారు.

మ్యాచ్ రెఫరీ నిర్ణయంపై ఉత్కంఠ..

శ్రీలంక బౌలింగ్ కోచ్ ర్యాన్ వాన్ నీకెర్క్ సైతం ఈ ఘటనపై మాట్లాడారు. ఆటలోని తీవ్రత కారణంగా భావోద్వేగాలు బయటకు వచ్చాయని, దీనిపై తుది నిర్ణయం మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు యశస్వి జైస్వాల్‌తో పాటు బౌలర్ అసిత ఫెర్నాండోపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినది: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే పరేషానే..!

కొలంబో టెస్టు తొలిరోజు బ్యాటింగ్‌లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా, పంత్ గాయం డ్రెస్సింగ్ రూమ్‌లో కాస్త కలవరం రేపింది. పంత్ రెండో రోజు మైదానంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుండగా, జైస్వాల్ వివాదంపై మ్యాచ్ రెఫరీ ఇచ్చే తీర్పు కీలకంగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *