Headlines

INDW vs PAKW: టాస్ పడగానే లేడీ రోహిత్ ఖాతాలో భారీ రికార్డ్.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా.. | Harmanpreet kaur 150 t20i captaincy world record ind vs pak


Harmanpreet Kaur Play 150th T20I as Captain: 2026 మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ ఉత్కంఠ పోరు ప్రారంభం కాగానే, ఒక ప్రపంచ రికార్డు ఖచ్చితంగా నమోదు కానుంది. పాకిస్థాన్‌తో తలపడనున్న భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మైదానంలోకి అడుగుపెట్టగానే ఆ ప్రపంచ రికార్డ్ నమోదు కానుంది.

హర్మన్‌ప్రీత్ కౌర్ పాకిస్థాన్‌తో తన 17వ టీ20ఐ ఆడనుంది. ఇది ఆమెకు 205వ టీ20ఐ మ్యాచ్ కాగా, కెప్టెన్‌గా ఇది ఆమెకు 150వ టీ20ఐ మ్యాచ్ అవుతుంది. ఇది ఒక ప్రపంచ రికార్డు.

ఎక్కువమంది చదివినది: 9 సిక్సర్లు, 10 ఫోర్లతో బుడ్డోడి అరాచకం.. దులీప్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ

ఇవి కూడా చదవండి



2026 మహిళల టీ20 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బరిలోకి దిగగానే, ఆమె 150 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రపంచంలోనే తొలి క్రీడాకారిణిగా నిలుస్తుంది. పురుషులు లేదా మహిళలలో మరే ఇతర క్రికెటర్ కూడా ఇన్ని మ్యాచ్‌లకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు.

హర్మన్‌ప్రీత్ కౌర్ గతంలో భారత్‌కు 149 టీ20ఐ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి, 86 గెలిచి, 57 ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా, ఐదు మ్యాచ్‌లు అసంపూర్తిగా ముగిశాయి. ఆమె గెలుపు శాతం 60.06గా నిలిచింది.

ఎక్కువమంది చదివినది: 27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా..!

పాకిస్తాన్ జట్టుపై హర్మన్‌ప్రీత్ కౌర్ గణాంకాలు చూస్తే.. 11 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా, వాటిలో 10 గెలిచి, 1 ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లలో హర్మన్ 197 పరుగులు చేసి, 2 వికెట్లు పడగొట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *