బుద్ధి కారకుడైన బుధుడు అనుకూలంగా ఉన్నంతవరకు తెలివితేటలు బాగా ప్రకాశిస్తాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. వ్యూహాలు, ప్రణాళికలు బాగా సక్సెస్ అవుతాయి. బుధుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ప్రతిఫలాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. జాతకంలోనూ, గ్రహ సంచారంలోనూ బుధుడు ఎంత అనుకూలంగా ఉంటే జీవితం అంతగా విజయవంతమవుతుంది. సెప్టెంబర్ 7 నుంచి 23 వరకు కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల మేషం, కర్కాటకం, తుల, కుంభం, మీన రాశులు ఆర్థిక విషయాలు, ప్లాన్లు, ఒప్పందాలు కుదర్చుకోవడం, వివాదాలు పరిష్కరించుకోవడంలో పొరపాట్లు చేయడం జరుగుతుంది.
మేషం
బుధుడు ఈ రాశికి పరమ పాప గ్రహం. షష్ట స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి తోనూ ఒప్పందాలు కుదర్చుకోకపోవడం, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తప్పటడుగులు వేయ డానికి అవకాశం ఉంది. ఇతరుల కోసం రుణాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
కర్కాటకం
ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ గ్రహ సంచారం వల్ల ఈ రాశివారు బంధుమిత్రుల కారణంగా ఆర్థికంగా దారుణంగా మోసపోయే లేదా నష్టపోయే అవకాశం ఉంది. వీరు ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోకపోవడం మంచిది. దీనివల్ల కష్టనష్టాల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తి వివాదాల్లో, కోర్టు కేసుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అద నపు ఆదాయానికి ప్రయత్నించడంలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
తుల
ఈ రాశికి వ్యయ స్థానంలో బుధ సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో అనాలోచితంగా వ్యవహరించడం జరుగుతుంది. ఆస్తి వివాదాల్లో పొరపాట్లు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నష్టదాయకంగా పరిష్కారమవుతాయి. పొరపాటున కూడా ఎక్కడా సంతకాలు చేయవద్దు. ఎవరి తోనూ ఒప్పందాలు కుదర్చుకోకపోవడం మంచిది. ఆస్తిపాస్తుల కొనుగోలు ప్రయత్నాలకు, గృహ, వాహన ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం ఉత్తమం.
కుంభం
ఈ రాశికి అష్టమ స్థానంలో బుధ సంచారం ఈ రాశివారికి ఏమాత్రం అనుకూలం కాదు. ఏ పనిలో నైనా, ఏ ప్రయత్నంలోనైనా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బంధుమిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వాగ్దానాలు చేయడం వల్ల, హామీలు ఉండడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. ప్రయాణాల వల్ల నష్ట పోవడం తప్ప లాభం ఉండదు. స్వార్థానికి ఉపయోగించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
మీనం
ఈ రాశికి బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనుకున్న పనులేవీ అనుకున్నట్టు జరగవు. ప్లాన్లు, పథకాలు, వాగ్దానాలు, హామీలు ఆశించిన స్థాయిలో ఫలించే అవ కాశం ఉండదు. ఎక్కడా ఆర్థిక, వ్యాపార ఒప్పందాల మీద సంతకాలు చేయకపోవడం మంచిది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో మోసపోవడం, నష్టపోవడం ఎక్కువగా ఉంటుంది. సహాయం పొందే వారే కానీ, సహాయం చేసే వారుండరు. ప్రయాణాల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
Also Read: భాద్రపద మాసంలో వీరికి సిరిసంపదలు, అధికార యోగం..!