Headlines

OTT Movie: ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. కేరళలో నిజంగా జరిగిన స్టోరీ | Must Watch Malayalam Horror Thriller Movie Based On True Events Sumathi Valavu Is Now Streaming On ZEE5 OTT


ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మలయాళం సినిమాలు, సిరీస్ లకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమానే. అందులోనూ నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అలాగే ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. టాక్ కు తగ్గట్టుగానే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. కేవలం రూ.5 కోట్ల బ‌డ్జెట్‌లోనే తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 30 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలోని తిర‌వ‌నంత‌పురం సమీపంలోని ఓ మారుమూల గ్రామం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అక్కడ చాలా కాలం క్రితం ఓ రోడ్డు మలుపులో గర్భవతి అయిన ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. అప్పటి నుంచి ఆమె దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉందనీ, ఆ దారిన వెళుతున్న ఎంతోమందిని బలి తీసుకుందని గ్రామస్తులు నమ్ముతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆ మలుపు దగ్గరక వెళ్లిన చాలా మంది కనిపించకుండా పోతారు. మరి ఆ మలుపులో నిజంగానే దెయ్యాలున్నాయా? గర్భవతి అయిన అమ్మాయి ఎలా చనిపోయింది? చివరికి ఈ మిస్టరీని ఛేదించారన్నదే ఈ సినిమా కథ.

కేరళలోని తిరువనంత పురం స‌మీపంలోని మైలమూడు ప‌రిస‌ర గ్రామాల్లో గతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు సుమతి వలవు. ఇదేదో సినిమా కోసంపెట్టిన పేరు కాదు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిజంగానే ఈ పేరుతో ఒక మలుపు ఉంది. ‘సుమ‌తి వ‌ల‌వు’ అంటే తెలుగులో ‘సుమ‌తి మ‌లుపు’ అని అర్థం. విష్ణు శశి శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో, మాళవిక మనోజ్, గోకుల్ సురేశ్, బాలు వర్గీస్, సైజూ కురుప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి



సుమతి వలవు సినిమా టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *