ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వివిధ భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సేమ్ టు సేమ్ ఈ కోవకే చెందుతుంది. ఆద్యంతం ఆకట్టుకనే కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు 7.9 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఓ షాకింగ్ సంఘటనతో సినిమా మొదలవుతుంది. కొన్ని ఇళ్లకు అనుమానాస్పదంగా గిఫ్ట్ బాక్సులు చేరుతాయి. వాటిని తెరిచి చూసిన తర్వాత అందరూ తీవ్ర భయభ్రాంతులకు గురవుతారు. బాక్సుల్లో మనుషుల చేతులు ఉండటంతో పోలీసులు షాక్ అవుతారు. వెంటనే దర్యాప్తు మొదలుపెడతారు. విచారణ సాగే కొద్దీ ఇది సాధారణ హత్యల కేసు కాదని పోలీసులకు అర్థమవుతుంది. కేసును ఛేదించే బాధ్యత తీసుకున్న సీనియర్ పోలీసాఫీసర్ కు కూడా ఈ కేసు ఓ చిక్కుముడిలా మారుతుంది. మరోవైపు కిల్లర్ మాత్రం పోలీసుల కంటే ఒక అడుగు ముందే ఉండి తన కిల్లింగ్ గేమ్ ను కొనసాగిస్తుంటాడు. ఆధారాలు దొరికినట్టే దొరికి మళ్లీ మిస్టరీగా మారిపోవడం, అనుమానితులు ఒక్కొక్కరుగా తెరపైకి రావడంతో సినిమా మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. మరి ఈ చేతుల వెనుక ఉన్న సైకో కిల్లర్ ఎవరు? ఇంత క్రూరంగా మనుషులను ఎందుకు చంపుతున్నారు ? గిఫ్ట్ బాక్సుల రూపంలో శరీర భాగాలను పంపడం వెనుక కిల్లర్ ఉద్దేశం ఏంటి ? మృతులందరి మధ్య ఉన్న కామన్ లింక్ ఏంటి ? చివరికి పోలీసులు ఈ సైకో కిల్లర్‌ను పట్టుకోగలిగారా ? చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘యుద్ధం సేయి’ (Yutham Sei). ఇదొక తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. క్రైమ్, సస్పెన్స్ , థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఈ క్రైమ్ థ్రిల్లర్స్‌లో చివరి వరకు అసలు కిల్లర్ ఎవరో అర్థం కాకుండా తన స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు దర్శకుడు మిస్కిన్ ఇందులో డిటెక్టివ్ జేకే పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు చేరన్ అద్భుతంగా నటించారు. మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, సైకలాజికల్ థ్రిల్ కలగలిపిన ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. జియో హాట్ స్టార్ తో పాటు జీ 5 ఓటీటీల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి యుద్దం సేయి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.