వరలక్ష్మీ వ్రతం చేశారు…అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
విశాఖపట్నం, గాజువాకలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. పండగ పూట అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అలంకరించిన బంగారు ఆభరణాలను ఒక కుటుంబం పొరపాటున డ్రైనేజీలో పడేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజానంతరం రమేష్ కొన్ని నగలను తీసివేశారు. అయితే, పూల మధ్యలో ఉండిపోయిన…