Headlines

Viral Video: సినిమాలనే మించిపోతున్నారు.. బంగారాన్ని దేంట్లో దాచాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే! | Watch Custom Officers Seize 869g Gold Hidden in Toy E Scooter Tyres at Delhi Airport

Viral Video: సినిమాలనే మించిపోతున్నారు.. బంగారాన్ని దేంట్లో దాచాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే! | Watch Custom Officers Seize 869g Gold Hidden in Toy E Scooter Tyres at Delhi Airport


స్మగ్లింగ్‌కు సంబంధించి మనం రోజూ అనేక రకాల వార్తను చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో పట్టుబడిన ఓ స్మగ్లర్‌ గురించి తెలిస్తే.. మీరు కచ్చితంగా నోరెళ్లబడతారు. ఓ ప్రయాణికుడు 6E-6133 నంబర్ గల ఇండిగో విమానంలో గురువారం జెల్లా నుంచి ముంబై మీదుగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నాడు. అయితే ఎయిర్‌ పోర్టు నుంచి బయటకొస్తూ అతను మెటల్ డిటెక్టర్ కూడా దాచి వచ్చాడు. అయినా ఎలాంటి అలారం మోగలేదు.

కానీ ఎందుకో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అతని దగ్గర ఉన్న లగేజ్‌ను చెక్‌ చేశారు. అయితే అతని లగేజ్‌లో ఇంటి సామగ్రితో పాటు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ కూడా కనిపించింది. అయితే హ్యాండ్ బగేజ్, చెక్-ఇన్ బగేజ్‌లను ఎక్స్-రే స్క్రీనింగ్ చేస్తున్న సమయంలో అధికారులకు అనుమానాస్పద చిత్రాలు కనిపించాయి.దీంతో వెంటనే ఆ స్కూటర్‌ను మొత్తాన్ని క్షుణ్నంగా పరిశీలించారు.

అంతే అసలు విషయం బయటపడింది. ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్ల లోపలి అతను బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి దాచినట్టు అధికారులు గుర్తించారు. అందులో మొత్తం 19 కట్ ముక్కల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం నికర బరువు 869.5 గ్రాములు ఉంటుందని నిర్ధారించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *