మీకు తెలుసా.. బొప్పాయి వీరికి మస్త్ డేంజర్.. తింటే ఆ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.. | Is Eating Papaya Daily Safe, Health Benefits, Digestion Risks and Expert Advice
ముఖ్యంగా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు బొప్పాయి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పచ్చి లేదా అరకొర పండిన బొప్పాయిలో లేటెక్స్ శాతం అధికంగా ఉండటం వల్ల గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని పాపైన్, లేటెక్స్ కొందరిలో తీవ్రమైన అలెర్జీలకు దారితీయవచ్చు. అంతేకాకుండా అధిక మొత్తంలో తింటే కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.