Watch: లోట్టలేసుకుని పానీపూరీలు, సమోసాలు తింటున్నారా.. ఒక్క క్షణం ఇది చూడండి..!
హైదరాబాద్ మహానగరంలోని అత్తాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి పేరు బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించారు. పానీపూరీలు, సమోసాలను భారీ స్థాయిలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వాటిని నగరంలోని పలు బండ్లకు సరఫరా చేస్తున్న ఈ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆహార భద్రతా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్…