Headlines

Raj Tarun: బ్యాడ్ లక్.. ఆ ఒక్క కారణంతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో రాజ్ తరుణ్ | Did You Know Raj Tarun Rejected National Award Winning Movie Shatamanam Bhavati For This Reason


రాజ్ తరుణ్.. ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలు, యూత్ ఫుల్ స్టోరీలతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే సినిమా చూపిస్తా మావా తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈడో రకం ఆడో రకం, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే తదితర సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు రాజ్ తరుణ్. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడీ యంగ్ హీరో. అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్, పురుషోత్తముడు, తిరగబడరా సామీ, భలే ఉన్నాడే, చిరంజీవ , పాంచ్ మినార్ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో నా సామి రంగా వంటి మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు రాజ్ తరుణ్. స్టార్ హీరో రేంజ్ కు వెళ్లాల్సిన రాజ్ తరుణ్ ఇప్పుడు రేసులో బాగా వెనకపడిపోయాడు. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఇబ్బందులు ఈ ట్యాలెంటెడ్ హీరో గ్రాఫుని తగ్గించేశాయి. ఇదిలా ఉంటే ఈ పరిస్థితికి రాజ్ తరుణ్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాల సెలెక్షన్ లో రాజ్ తరుణ్ తప్పటడుగులు వేశాడు.

గతంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో శర్వానంద్ హీరోగా వచ్చిన ‘శతమానం భవతి’ సినిమా కథని మొదట రాజ్ తరుణ్ కోసం అనుకున్నారట. అతనికి కథ కూడా వినిపించారు. ఇక అతనే హీరోగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేద్దామనుకున్నారట. అయితే ఇంతలోనే రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర ఆ కథ అంత ఎఫెక్టివ్ గా లేదనడంతో రాజ్ తరుణ్ ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడట. కట్ చేస్తే.. శతమానం భవతి సినిమా కథ శర్వానంద్ దగ్గరకు వెళ్లడం బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. శతమానం భవతి సినిమా కథను రాజ్ తరుణ్ కంటే రాజా రవీంద్రనే రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన తొందరపాటు నిర్ణయంతో ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను చేజేతులా వదులుకున్నాడు రాజ్ తరుణ్. ఒకవేళ అతను గనక ఈ సినిమాను చేసి ఉంటే అతని కెరీర్ కు మంచి హెల్ప్ అయ్యేదని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *