Headlines

Rashmika Mandanna: రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? విజయ్‌కు కూడా బెస్ట్ ఫ్రెండ్ | Actress Rashmika Mandanna shares a special bond with Tollywood actor Nani

Rashmika Mandanna: రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? విజయ్‌కు కూడా బెస్ట్ ఫ్రెండ్ | Actress Rashmika Mandanna shares a special bond with Tollywood actor Nani


నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటివరకు టాలీవుడ్ కే పరితమితమైన ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా పాకింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక. అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ ఛాన్స్ అవకాశాలు దక్కించుకుంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజుల క్రితమే
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కలిసి పెళ్లిపీటలెక్కిందీ ముద్దుగుమ్మ. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా ఏడడుగులు నడిచారీ లవ్ బర్డ్స్. పెళ్లి తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న వీరు ఇప్పుడు మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రష్మిక. ఇదేక క్రమంలో ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఆమెకు మంచి స్నేహితులుగా మారారు. కాగా టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోను రష్మిక మందన్న తనకు సొంత బ్రదర్‌లా భావిస్తుందట. అతను మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని.

నాని- రష్మికలు ‘దేవదాస్’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. 2018లో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ అప్పటినుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. ముఖ్యంగా హీరో నానిని రష్మిక ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే కాకుండా సొం బ్రదర్‌లా భావిస్తుందట. ఇక విజయ్ దేవరకొండకు కూడా నాని మంచి స్నేహితుడు. విజయ్ కెరీర్ బిగినింగ్ లో నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ ఓ కీ రోల్ పోషించాడు. ఈ సినిమా తర్వాతే రౌడీ బాయ్ క్రేజ్ క్రమంగా పెరిగిపోయింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత రష్మిక నటించిన మొదటి సినిమా కాక్ టెయిల్ 2. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. దీని తర్వాత రణబాలి సినిమాలో నటిస్తోంది రష్మిక.  రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. గతంలో విజయ్- రాహుల్ కాంబినేషన్ లో వచ్చిన టాక్సీవాలా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తోన్న రణబాలిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి



Rashmika Mandanna, Nani

Rashmika Mandanna, Nani

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *