Headlines

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా..


Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా..

పై ఫొటోలో సర్కిల్ లో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆ పాప ఇప్పుడు తెలుగు నాట ఫేమస్ హీరోయిన్. అలాగనీ పెద్ద సంఖ్యలో సినిమాలేమీ చేయలేదు. 2022లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి ఒక ఐదారు సినిమాలు మాత్రమే చేసింది. అయితేనేం ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాల్లో తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టి పడేసే ఈ ముద్దుగుమ్మ మల్టీ ట్యాలెంటెడ్. కేవలం నటనతోనే కాకుండా నాట్యంతోనూ మైమరిపిస్తుంది. కథాకళి, భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడి వంటి క్లాసికల్ డ్యాన్స్ లో ఈ అందాల తారకు మంచి ప్రావీణ్యముంది. ఇప్పటివరకు పలు వేదికలపై అద్బుతమైన ప్రదర్శనలు ఇచ్చింది కూడా. ఇక ఈ బ్యూటీలో ఉన్న మరో ట్యాలెంట్ మార్షల్ ఆర్ట్స్. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఈ ముద్దుగుమ్మ కళరిపాయట్టులోనూ శిక్షణ తీసుకుంది. అందుకే సినిమా ఈవెంట్లలోనూ స్టంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోందీ అందాల తార. ముఖ్యంగా ఆ మధ్యన చీరకట్టులోనూ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. మరి ఈ మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు అనంతిక సనిల్ కుమార్.

ఇవాళ అనంతిక హీరోయిన్ గా నటించిన రోమాంచకం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తనకు సంబంధించిన త్రో బ్యాక్ ఫొటోస్, వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. 2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనంతిక. ఆ తర్వాత 2023లో మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రైడ్ (తమిళం), లాల్ సలామ్, పరిమళ అండ్ కో (తమిళం) సినిమాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. అయతే గతేడాది విడుదలైన 8 వసంతాలు సినిమా అనంతికకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ తెలంగాణ గద్దర్ పురస్కారం కూడా అందుకుందీ అందాల తార.

ప్రభాస్ తో అనంతిక..

 

View this post on Instagram

 

A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar)

తాజాగా రోమాంచకం అనే ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనంతిక. సుమంత్ ప్రభాస్ ఈ మూవీలో హీరోగా నటించాడు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా నిర్మించడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *