Headlines

Tollywood : గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లోకి.. ఇప్పుడు స్టార్ హీరో.. | Know This Star Hero Who Did Films To Repay His Mother Loan and Worked in Garment Factory, He Is Suriya


ప్రస్తుతం సినీరంగంలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే వారిలో కొందరు తమ తండ్రి వల్ల నటులైతే, మరికొందరు తమ సొంత కృషితో సినీ రంగంలోకి వచ్చారు. అలాంటి ఒక స్టార్ గురించి చెప్పాలంటే, అతను తన తల్లి వల్ల నటుడయ్యాడు. అయితే, తన తండ్రికి తెలియకుండా తన తల్లి రూ. 25,000 అప్పు తీసుకుందని ఆ అప్పు తీర్చడానికి తాను సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు. అతడు మరెవరో కాదు శరవణన్ శివకుమార్ అలియాస్ హీరో సూర్య. ఆయన తండ్రి ఇండస్ట్రీలో పాపులర్ నటుడు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు, సూర్య ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో ట్రైనీగా పనిచేశాడు. 15 రోజుల కష్టానికి కేవలం రూ. 750 మాత్రమే సంపాదించాడు. అయితే, వ్యాపారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత, సూర్య నెలకు రూ. 8000 ఆదాయం సంపాదించాడు. ఎప్పటికైనా తను సొంతంగా గార్మెంట్ వ్యాపారం ప్రారంభించాలని సూర్య ఆశించాడట.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

తన స్టార్టప్ వ్యాపారంలో తన తండ్రి కోటి రూపాయల మూలధనం పెట్టుబడిగా పెట్టాలని కూడా అతను ఎదురుచూశాడు. సూర్య మాట్లాడుతూ.. “మా బ్యాంకు ఖాతాలో ఎప్పుడూ లక్ష లేదా లక్షన్నర రూపాయలకు మించి డబ్బు ఉండేది కాదని అమ్మ చెప్పేది. నాన్న కూడా తన జీతం కోసం ఎప్పుడూ పట్టుబట్టేవారు కాదు; అది వచ్చినప్పుడు దానికోసం వేచి ఉండేవారు. ఆ సమయంలో, నాన్న ఆరు నెలలు లేదా పది నెలల కంటే ఎక్కువ కాలం నిరంతరాయంగా పని చేయలేదు. నేను చిత్ర పరిశ్రమలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు; కెమెరా ముందుకు రావాలని ఎప్పుడూ కోరుకోలేదు, నటుడిని కావాలని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మకు రూ. 25,000 తిరిగి ఇచ్చి, ‘నీ అప్పు తీరిపోయింది, నువ్వేం చింతించక్కర్లేదు. అని చెప్పడం కోసమే నేను ఈ పరిశ్రమలోకి వచ్చాను” అని చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

1997లో విడుదలైన ‘నెరుక్కు నెర్’ చిత్రంతో సూర్య తొలిసారిగా వెండితెరపై కనిపించారు. వసంత్ దర్శకత్వంలో, మణిరత్నం నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత గజిని సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. యాక్షన్ సినిమాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటున్నాడు సూర్య.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

సూర్య..

Suriya New

Suriya New

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *