కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఏకంగా ఐదు గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ యశ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు యశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. టాక్సిక్ సినిమా కథని మొదట ఒక స్టార్ హీరోకి వినిపించారట దర్శక నిర్మాతలు. కానీ ఆయన ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదట. దీంతో ఫైనల్ గా యశ్ ను తీసుకున్నారట.
టాక్సిక్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ సూర్య అని తెలుస్తోంది. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు మోతాదుకు మించి ఉండడం, అలాగే యాక్షన్ సీక్వెన్సులు కూడా భారీగా ఉండడంతో సూర్య ఈ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటలకు విశాల్ కూడా సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి
టాక్సిక్ సినిమాలో యశ్, కియారా అద్వానీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి