టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ గ్రౌండ్లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో బయట అంత సరదాగా ఉంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. టీమ్ మెట్స్‌తో కలిసి సరదాగా ఉన్న వీడియోలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా తిలక్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీనుతో ఓ రీల్లో నటించాడు. అయితే ప్రోఫెషన్ పరంగా క్రికెటర్ అయిన తిలక్ ఈ రీల్లో మాత్రం చాలా నేచ్యురల్‌గా నటించాడు.
తన కూమారుడి కంటే ఎక్కువ సంపాదించే చుట్టాల అబ్బాయిని చూసి అసూయపడే ఓ ఆంటీ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ రీల్లో రీను అసూయపడే ఆంటీలా నటిస్తే, తిలక్ డెవలప్ అయిన కుర్రాడిలా నటించాడు. డైలాగులు లేకపోయినా కేవలం హావభావాలతో ఇద్దరూ అదరగొట్టారు. ఈ రీల్‌ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన రీను.. దమ్ముంటే ఈ వీడియోని అసూయ పడే మీ చుట్టాల ఆంటీకి పంపండి అంటూ పేర్కొంది. కాగా ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే భారీగా వ్యూస్, లైక్స్ వచ్చేశాయి. మరి క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మన తెలుగు కుర్రాడు తిలక్‌కు సినిమా ఇండస్ట్రీలోనూ మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ రీల్ చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ మీరు రీల్ చూశారా? కింద ఉంది చూసేయండి..