Headlines

Viral News: అరెరే ఇన్నాళ్లు తెలిదే.. వారంలో ఎవరికీ నచ్చని.. పరమ చెత్త రోజు ఇదేనట! | Guinness World Records Names Monday The Week’s Worst Day, check Why People Hate it


నార్మల్‌గా వారం మొత్తం పనిచేసిన జనాలు ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆత్రుతగా చూస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు సెలవు దినం.. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, ఫ్యామిలీతో సరదాగా గడపొచ్చు. అందుకే ఇది అందరి ఫేవరేట్ రోజుగా చరిత్రలో నిలిచి పోయింది. అచ్చం ఇలాగే వారంలో చెత్త రోజు, ఎవ్వరికీ నచ్చని రోజు కూడా ఒకటి ఉంది.. అదే సోమవారం. అవును సోమవారం అనేది ప్రజల మనస్సులో పరమ చెత్త రోజుగా నిలిచిపోయిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో స్పష్టం చేసింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. వారంలో అత్యంత చెత్త రోజుగా సోమవారం అధికారిక గుర్తింపు పొందింది. దశాబ్దాలుగా ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనకు ఈ ప్రకటనతో అంతర్జాతీయ ముద్ర పడింది. అయితే వారంలో జనాలను నచ్చని రోజు గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను సేకరించగా.. అందులో వారంలో అత్యంత నీరసమైన, కష్టమైన రోజు సోమవారమేనని తేలినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

ప్రజల ఆందోళనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు!

సాధారణంగా వారమంతా పనిచేసి ఆదివారం సంతోషంగా గడిపిన జనాలకు సోమవారం మార్నింగ్ మోగిన అలారం తెగ చిరాకు తెప్పిస్తోంది. ఆ రోజు నుంచే మళ్లీ వారం పాటు చచ్చినట్టు ఆఫీస్‌కు వెళ్లాలనే ఆలోచనే వారికి చాలా కష్టంగా ఉంటుంది. వారమంతా పనిచేసి సంతోషంగా గడిపిన క్షణాలు మరువక ముందే వచ్చే రోజు పట్ల ప్రజలు వ్యక్తపరిచే అసంతృప్తికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *