తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్ధులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 62 అంగన్‌వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆగస్టు 5, 2026వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది.
మేడ్చల్ జిల్లా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా పోస్టుల వివరాలు ఇలా..
- అల్వాల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో పోస్టులు: 18
- మేడ్చల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో పోస్టులు: 20
- కుత్బుల్లాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో పోస్టులు: 24
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ (12వ తరగతి) లేదా ఆపై విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులు. అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్/12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్ధుల వయోపరిమితి 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దివ్యాంగ మహిళలు కూడా నిర్దేశిత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత ప్రాంతానికి చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత వార్డులో నివసిస్తూ ఉండాలి.
మేడ్చల్ జిల్లా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తూ ఉండాలి. గిరిజన తండాలు, గూడేలు, ఆవాసాల్లోని పోస్టులకు ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్టీ మహిళలకు అవకాశం ఉంటుంది. ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు అర్హులు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్ట్ 5, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ టీచర్ పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. మేడ్చల్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా అంగన్‌వాడీ పోస్టుల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మేడ్చల్ జిల్లా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.