Headlines

అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు | Actress Sudha Reveals Jr NTR Humility: A Pan India Journey Perspective

అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు | Actress Sudha Reveals Jr NTR Humility: A Pan India Journey Perspective


తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న నటి సుధ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె. అంతే కాదు సీనియర్ హీరోల దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న కుర్ర హీరోల వరకు అందరి సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె. ముఖ్యంగా తల్లి పాత్రలతో పాపులర్ అయ్యారు సుధ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె  తన కెరీర్‌లోని పలు మధురానుభూతులను పంచుకుంటూ, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కళ్ల ముందే పెరిగిన పిల్లలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మంచు మనోజ్ వంటి స్టార్స్ గురించి, పెద్దల పట్ల వారి గౌరవం గురించి ఆమె ప్రస్తావించారు.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

ఎన్టీఆర్ ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. అన్నారు. “బాద్ షా” సినిమా షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక పాటకు డాన్స్ చేసే సందర్భాన్ని సుధ గుర్తు చేసుకున్నారు. నైట్ షూట్‌లో తన కాలు స్కిడ్ అయ్యి బెణికినప్పుడు, ఒక స్టార్ హీరో అయినప్పటికీ, ఎన్టీఆర్ వెంటనే స్పందించి, తన కాలు పట్టుకుని స్ప్రే కొట్టి పరామర్శించారని తెలిపారు. “ఆ పిల్లోడిని నేను అలా చూశాను. డౌన్ టు ఎర్త్ అంటారు కదా, అందుకే” అని సుధ అన్నారు. చిన్నతనంలో అల్లరి పిల్లోడిలా ఉండే తారక్, ఇప్పుడు కుటుంబంలో ఎలా ఉండాలో, ఫ్యామిలీ విలువలు ఎలా కాపాడాలో తెలిసిన వ్యక్తిగా మారాడని, అయితే ఆయనలోని అల్లరి, ఉత్సాహం మాత్రం అలాగే ఉందని ఆమె  అన్నారు. పెద్దల పట్ల ఆయన చూపే గౌరవం, మర్యాదలు ప్రశంసనీయమని, తన తాత ఎన్.టి.రామారావు గారితో పని చేశానని, ఇప్పుడు ఆయన మనవడితో పనిచేయడం గర్వంగా ఉందని సుధ అన్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

సుధ తన కెరీర్‌లో తరతరాల నటులతో పనిచేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి వంటి దిగ్గజాలతో పాటు వారి తర్వాతి తరం హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సుమంత్, సుశాంత్, అఖిల్, మంచు మనోజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారితో కూడా కలిసి పనిచేశా అన్నారు. “మేజర్ చంద్రకాంత్” షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ చిన్నపిల్లాడిగా సెట్‌కు వచ్చి కూర్చునేవారని, “గ్యాంగ్ లీడర్” సమయంలో రామ్ చరణ్ చిన్నవాడని, మంచు మనోజ్ తన కొడుకులా తన ఒడిలో కూర్చుని తినేవాడని ఆమె పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ అనుబంధాలన్నీ తనకు దక్కిన అదృష్టమని, ఇప్పుడున్న నటులకు ఇలాంటి బంధాలు దక్కడం లేదని విచారం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *