ఆయిల్ లీకేజీలు: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవే. ఇంజిన్, గేర్‌బాక్స్, కూలెంట్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి లూబ్రికెంట్ లేదా నీరు లీక్ అవుతున్నాయా? లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఏదైనా లీకేజీ ఉంటే వాటిని అస్సలు కొనకండి. ఎందుకంటే ప్రారంభంలో ఇది చిన్న సమస్యగా అనిపించినా, తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్‌కు దారితీసి భారీ ఖర్చు పెట్టిస్తుంది. కాబట్టి ఈ సారి కారు కొనే ముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తించుకోండి.
ఛాసిస్ బలం: కారు చాసీస్ ఎంత బలంగా ఉంటే అంత సేఫ్టీ.. సెకండ్ హ్యాండ్ కార్లు అప్పటికే వాడి ఉంటారు కాబట్టి.. నీరు, తేమ లేదా బురద రోడ్ల వల్ల కారు కింది భాగంలో తుప్పు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఛాసిస్‌కు తుప్పు పడితే వాహనం నిర్మాణ దృఢత్వం, భద్రత దెబ్బతింటాయి. అందుకే చాసీస్కు లోతైన తుప్పు లేదా గుంతలు పడినట్లు ఉంటే అటువంటి కారును తీసుకోకపోవడమే మంచిది.
సస్పెన్షన్ సిస్టమ్: మీ ప్రయాణం సాఫీగా సాగాలి అంటే సస్పెన్షన్ చాలా ముఖ్యం. ఇది బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. మీరు కారు కొనే ముందు షాక్ అబ్జార్బర్లు సరిగ్గా ఉన్నాయా? అరిగిపోయాయా అనేది చెక్ చేసుకోండి. అవి డ్యామేజ్ అయినా టైర్లపై అదనపు ఒత్తిడి పడి త్వరగా పాడవుతాయి. లిఫ్ట్‌పై ఎత్తినప్పుడు బుషింగ్లు, స్ప్రింగ్‌ల పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కారు కొనే ముందు దాన్ని కచ్చితంగా లిఫ్ట్ చేసి చూడండి.
యాక్సిడెంట్ గుర్తులు: కొన్ని సార్లు పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు పై భాగాన్ని రిపేర్ చేసి వాటికి పెయింట్ వేపిస్తూ ఉంటారు. వీటిని పైకి కనిపించకుండా మెరుపులు దిద్దుతారు. కానీ కారు కింది భాగంలో మాత్రం వెల్డింగ్ గుర్తులు, వంగిపోయిన ఫ్రేమ్‌లు లేదా అసమాన ఉపరితలాలు ప్రమాదాన్ని పట్టేస్తాయి. కాబట్టి కారును ఎత్తి చూసినప్పుడు స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉంటే వెంటనే తెలుస్తుంది. అలాంటి కారు భద్రత పరంగా అస్సలు మంచిది కాదు. అలాంటి వాటిని కొనకపోవడమే మంచిది.
మెకానిక్ సాయం: మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి వెళ్లినప్పుడు కచ్చితంగా మీ వెంట ఓ మెకానిక్‌ను తీసుకొని వెళ్లండి. డీలర్షిప్ లేదా ఇంటి వద్ద సాధారణంగా చూస్తే అన్ని లోపాలు కనిపించవు. కారును నమ్మకమైన వర్క్‌షాప్‌కు తీసుకెళ్లి, హైడ్రాలిక్ లిఫ్ట్‌పై పెట్టి మంచి మెకానిక్‌తో అండర్బాడీ చెకప్ చేయించాలి. దీనికి కొద్దిగా ఖర్చయినా, భవిష్యత్తులో వచ్చే భారీ నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.




