Headlines

అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా | Did you recognize the actress in this photo, She is beautiful Actress Anu Emmanuel

అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా | Did you recognize the actress in this photo, She is beautiful Actress Anu Emmanuel


సినిమా రంగంలో ప్రస్తుతం అగ్ర నటీమణులుగా వెలుగొందుతున్న కొందరు ఒకప్పుడు బాలనటులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. అటువంటి నటీమణులలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో మెల్లగా ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం సాలిడ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు అందం అభినయంతో ఆకట్టుకున్న అను ఇమ్మానుయేల్. ఆమె జీవితంలో ఎక్కువ భాగం అమెరికాలోనే గడిపింది. అక్కడే పుట్టి పెరిగింది ఈ అమ్మడు.

ఇది కూడా చదివేయండి : అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక

అయితే, ఆమె బాల్యంలో ఉన్నప్పుడు అనుకోకుండా మలయాళ చిత్రం స్వప్న సంచారిలో బాలనటిగా నటించే అవకాశం లభించింది. ఈ చిత్రంతోనే అను బాలనటిగా ప్రశంసలు అందుకున్నారు. స్వప్న సంచారి తర్వాత అను ఇమ్మానుయేల్ మళ్లీ అమెరికా వెళ్లిపోయినప్పటికీ, నటిగా ఎదగాలి, హీరోయిన్‌గా పేరు సంపాదించుకోవాలి అనే కోరిక ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. పెద్దైన తర్వాత, దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా, పరీక్షల కారణంగా దానిని కోల్పోయింది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేయండి : RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో

ఆ తర్వాత, నివిన్ పాలీ సరసన యాక్షన్ హీరో బిజు చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తెలుగు ప్రేక్షకులకు మజ్ను చిత్రంతో పరిచయమైన అను ఇమ్మానుయేల్, ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్రశ్రేణి హీరోలతో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. అలాగే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.  అనుకోకుండా బాలనటిగా వచ్చిన అవకాశం, ఆమెను ఈరోజు ఇంత పెద్ద హీరోయిన్‌గా ఎదగడానికి ఎంతగానో తోడ్పడింది. ఇప్పుడు సరైన ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *