Headlines

ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ శుభవార్తలు! | Daily Horoscope for August 6, 2026: Thursday Astrology Predictions for All 12 Zodiac Signs

ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ శుభవార్తలు! | Daily Horoscope for August 6, 2026: Thursday Astrology Predictions for All 12 Zodiac Signs


దిన ఫలాలు (ఆగస్టు 6, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం తగినంతగా పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం తగినంతగా పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో వైద్యుల్ని సంప్రదించాల్సి వస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సాను కూలంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరుల వ్యవహా రాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొద్దిగా చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో చక్కబడతాయి. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యయ ప్రయాసలతో తప్ప ఏ పనీ పూర్తి కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

ఇవి కూడా చదవండి



మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ప్రభుత్వ అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలు, దైవ సేవా కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసా టిగా సాగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. శత్రువులు, పోటీదార్ల సమస్యల నుంచి తెలివిగా బయటప డతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అన్ని విధాలా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో దూసుకుపోతారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని ఒత్తిడితో పాటు అధికారుల వేధింపులు కూడా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పని ఒత్తిడి పెరిగి, విశ్రాంతికి దూరమవుతారు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు సమయం అనుకూలంగా లేదు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఆదాయం బాగానే పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరించడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆదాయం పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభి స్తుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులు,జీవిత భాగస్వామి మీ మాటలతో విభేదిస్తారు. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఉద్యోగం మార డానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిల కడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఏమంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వృథా ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో విశేషమైన లాభాలు గడిస్తారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలన్నిటినీ శ్రమపడి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడతారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. బ్యాంక్ రుణాల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఓర్పుతో ఉండడంమంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి మీకు రావలసిన డబ్బు అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కూడా చాలావరకు తగ్గుముఖం పడతాయి. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధార పడతారు. వ్యాపారాల్లో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. ఇతరుల వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. అనుకోకుండా కొన్ని ప్రధానమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

గమనిక: ఈ కథనం పూర్తిగా జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహ సంచారాలు, రాశి ఫలితాల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో పేర్కొన్న అంశాలు వ్యక్తిగత విశ్వాసాలు, సంప్రదాయ జ్యోతిష్య సిద్ధాంతాలపై ఆధారపడినవి మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా పరిగణించరాదు. వ్యక్తిగత అనుభవాలు, జన్మకుండలి, దశలు, గోచారాలు వంటి అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *