Headlines

ఆమె సీనియర్.. ఇతను జూనియర్.. సానుభూతి చూపిస్తే.. ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. | Uday Krishna Reddy Remand Report: Hyderabad Police Reveal Shocking Details About Trainee IPS Officer

ఆమె సీనియర్.. ఇతను జూనియర్.. సానుభూతి చూపిస్తే.. ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. | Uday Krishna Reddy Remand Report: Hyderabad Police Reveal Shocking Details About Trainee IPS Officer


కూరగాయలు అమ్మిన వ్యక్తి కానిస్టేబుల్ కావడమే గొప్ప అనుకుంటే.. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాడు.. 2025 బ్యాచ్ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యాడు. వారెవ్వా అనిపించుకుని.. అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. శిఖరమంత ఎత్తుకి ఎదిగిన ఇమేజ్‌.. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. ట్రైనింగ్‌లోనే ఇతని విశ్వరూపం ఇలా ఉంటే.. ట్రైనింగ్ అయిపోయి ఉంటే..? ఈ సందేహం అందర్నీ ఆలోచనలో పడేసింది. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. ఉదయ్‌ కృష్ణారెడ్డి ప్రవర్తన, మానసిక స్థితిని రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రముఖంగా వివరించారు..

2025 బ్యాచ్‌తో కలిసి ట్రైనింగ్

వాస్తవానికి బాధితురాలికి ఉదయ్‌ జూనియర్‌.. గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డికి బాధితురాలితో పరిచయం ఏర్పడింది. తన విక్టరీ జర్నీపై ఉదయ్ చేసిన పోస్ట్‌కి బాధితురాలు స్పందించింది. ఉదయ్ బ్యాగ్రౌండ్ తెలుసుకుని సానుభూతి చూపించింది. తాను 2004 బ్యాచ్ ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యానని.. అయితే ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్‌లో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసి ట్రైనింగ్‌లో చేరనున్నట్టు తెలిపిందామె. ఆ తర్వాత ఇద్దరు ఫోన్‌ నంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలెట్టారు. అదికాస్త ప్రేమకు దారితీసింది.

బాధితురాలి కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ని కలిసిన ఉదయ్

NPAలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడింది. అయితే కొద్దిరోజులకే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. ఉదయ్ పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. బాధితురాలి ల్యాప్ టాప్ విసిరి ధ్వంసం చేశాడు. ఆమె తనను బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేశాడు. వ్యక్తిగత చాట్‌లను బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు ఉదయ్. బాధితురాలి అనుమతి లేకుండా కుటుంబసభ్యులను, ఫ్రెండ్స్‌ని కాంటాక్ట్ అయ్యాడు. టార్చర్ పెరగడంతో బాధితురాలు ఉదయ్‌ నుంచి దూరంగా ఉంది. ఆపై మరొకర్ని పెళ్లి చేసుకుంది. అయినా ఉదయ్ వేధింపులు ఆగలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు.

దురుసు ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు

హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఉదయ్ నివాసంలో సోదాలు చేసిన పోలీసులు.. ఓ సెల్‌పోన్‌, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. అభ్యాస్‌ ఐఏఎస్‌ అకాడమీని ఉదయ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. మొత్తంగా ఉదయ్ వింత ప్రవర్తన.. పొసెసివ్ బిహేవియర్, దురుసు ప్రవర్తనతో బాధితురాలు విసిగిపోయినట్టు రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు.

నిజానికి బాధితురాలికి ఉదయ్ జూనియర్. ఆమె కంటే ముందే ఉదయ్‌కి మరో ఇద్దరు అమ్మాయిలకు ప్రపోజ్ చేశాడట. వారిలో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో.. బాధితురాలకి దగ్గరైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బాధితురాలితో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. అయితే.. ఉదయ్‌ వింత ప్రవర్తన, పొసెసివ్‌ బిహేవియర్‌, దురుసు ప్రవర్తనతో బాధితురాలు విసిగిపోయినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లోఉంది. ఆ తర్వాత, తనను దూరం పెట్టడంతోనే బాధితురాలిని వేధించి ఆమెపై హత్యాయత్నం చేశాడంటూ ట్రైనీ IPSపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో అశోక్‌నగర్‌లోని ఉదయ్‌ నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. అతడి ఇంట్లో ఒక సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇంతేగాదు, అభ్యాస్‌ IAS అకాడమీని ఉదయ్‌ నిర్వహిస్తున్నట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో వివరించారు పోలీసులు. అయితే.. ఉదయ్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో ఏముంది? పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌కి సంబంధించిన వివరాలు ఉన్నాయా? మరి అవి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *