Headlines

ఆలియా భట్‌ మరో అరుదైన రికార్డ్ | Alia Bhatt Sets New Record, Tops Female Stars in Brand Value Report video TV9D – Entertainment Videos in Telugu

ఆలియా భట్‌ మరో అరుదైన రికార్డ్ | Alia Bhatt Sets New Record, Tops Female Stars in Brand Value Report video TV9D – Entertainment Videos in Telugu


బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకున్న ఆలియా భట్, వరుస సినిమాలతోనే కాకుండా బిజినెస్ ఉమెన్‌గానూ, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గానూ దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్‌లో 892 కోట్ల రూపాయల బ్రాండ్ వాల్యూతో ఫీమేల్ స్టార్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు ఈ బ్యూటీ. భర్త రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఎంతోమంది స్టార్ హీరోలను సైతం బ్రాండ్ వాల్యూలో వెనక్కి నెట్టేశారు ఆలియా.బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె సైతం ఈ బ్రాండ్ వాల్యూ వార్‌లో ఏమాత్రం తగ్గట్లేదు. 849 కోట్ల రూపాయల బ్రాండ్ వాల్యూతో ఆలియా తర్వాతి స్థానంలో ఉన్నారు దీపిక. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోషన్స్, తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్ సక్సెస్‌తో ఈ లిస్ట్‌లో ఆలియాకు గట్టి పోటీ ఇస్తూ ఫీమేల్స్ కేటగిరీలో సెకండ్ ప్లేస్ లో నిలిచారు.పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం ఈ రేసులో సత్తా చాటుతున్నారు. సౌత్‌తో పాటు భారీ బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు కేరాఫ్ నేషనల్‌ క్రష్ ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు రష్మిక. ఈ క్రమంలోనే 716 కోట్ల బ్రాండ్ వాల్యూతో ఈ లిస్ట్‌ 12వ స్థానం సొంతం చేసుకున్నారు. ఈ బ్యూటీ. కేవలం యాక్టింగ్‌లోనే కాకుండా మన స్టార్స్ బ్రాండ్ వాల్యూ పరంగా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *