Headlines

ఆ పాత్ర ఇష్టం లేకుండానే చేశా.. ఫోన్ చేసి బూతులు తిట్టారు.. షాకింగ్ విషయం చెప్పిన తనికెళ్ల భరణి | Tanikella Bharani interesting comments about Midhunam movie and YVS Chowdary Movie

ఆ పాత్ర ఇష్టం లేకుండానే చేశా.. ఫోన్ చేసి బూతులు తిట్టారు.. షాకింగ్ విషయం చెప్పిన తనికెళ్ల భరణి | Tanikella Bharani interesting comments about Midhunam movie and YVS Chowdary Movie


నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిధునం సినిమాతో దర్శకుడిగానూ ప్రతిభ చాటుకున్నారు భరణి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో నటుడిగా, దర్శకుడిగా తనదైన శైలిని ఏర్పరచుకున్నారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తానని, ప్రొడ్యూసర్ క్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఆయన నిత్యం చెబుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నటుడిగా తన కెరీర్‌లో కొన్ని కఠినమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. YVS చౌదరి సినిమా కోసం ట్రాన్స్ జెండర్ వేషం వేయాల్సి వచ్చినప్పుడు, ఆ బాడీ షేమింగ్ తనకెంతో ఇబ్బంది కలిగించిందని, అది తన జీవితంలో ఒక బాధాకరమైన వేషంగా మిగిలిపోయిందని అన్నారు. ఆవేశం వేసినందుకు చాలా మంది ఫోన్ చేసి విమర్శించారని, కొందరు బూతులు కూడా తిట్టారని భరణి తెలిపారు. అయితే, ఒక్కసారి సెట్‌లో కాలు పెట్టిన తర్వాత దర్శకుడు ఏం చెబితే అది చేయడమే నటుడి ధర్మమని ఆయన నమ్మకం.

ఇది కూడా చదవండి : వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

రంగస్థల నేపథ్యం ఉన్న భరణి, షార్ట్ ఫిల్మ్‌లతో దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వికల్ప అనే సంస్థను స్థాపించి సిరా అనే మొదటి షార్ట్ ఫిల్మ్ తీశారు. అది అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత బ్లూ క్రాస్, ది లాస్ట్ ఫార్మర్, కీ వంటి షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ అనుభవమే మిథునం లాంటి ఒక ప్రయోగాత్మక చిత్రానికి దర్శకత్వం వహించడానికి దోహదపడిందని తెలిపారు భరణి. శ్రీరామ కథ ఆధారంగా తెరకెక్కిన మిథునం చిత్రాన్ని ఒక కోటి రూపాయల బడ్జెట్‌లో తెరకెక్కించేందుకు ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావడంతో, భరణి ఎంతో ఉత్సాహంగా పనిచేశారట. ఇద్దరు ఆర్టిస్టులతో కూడిన కథను, సింగిల్ ఎన్ ఆర్ట్ చిత్రంగా ఊహించి, బాలసుబ్రహ్మణ్యం గారిని, లక్ష్మి గారిని ప్రధాన పాత్రలకు ఎంపిక చేసుకున్నారట.

ఇది కూడా చదవండి : 21 సినిమాలు చేస్తే.. మూడు మాత్రమే హిట్..! కట్ చేస్తే విలన్‌గానూ అదరగొట్టాడు

ఈ సినిమా కోసం సంవత్సరం పాటు వేరే ఏ పనులు చేయకుండా 24 గంటల పాటు అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో S. P. బాలసుబ్రహ్మణ్యం గారి నటనకు ముగ్దుడై, కట్ చెప్పలేకపోయానని భరణి చెప్పారు. “భరణి ఎప్పుడైనా నా జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు, మిథునానికి తర్వాత అని రాస్తాను” అని బాలు గారు చెప్పిన మాటలు తన జీవితంలోనే గొప్ప ప్రశంస అని భరణి పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్ పెరిగినా, అంతర్జాతీయ అవార్డులు వచ్చినా, ఈ సినిమాకు దర్శకుడిగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ముయిద ఆనందరావులాంటి ప్రొడ్యూసర్‌కు సహాయపడడమే గొప్పగా భావించారు. ఈ సినిమా కోసం ఏడాది పాటు ఇతర అవకాశాలను వదులుకున్నా, మిథునం తెచ్చిన తృప్తి, నిత్యం దాని గురించి మాట్లాడే గొప్ప అవకాశం వెలకట్టలేనివని భరణి అన్నారు. మిథునం ఆయన జీవితంలో ఒక చంద్రయాన్ లాంటి ప్రయోగమని భరణి అన్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *