Headlines

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ అక్కడే దెబ్బకొట్టింది : ఎస్‌కేఎన్ | Tollywood producer SKN Interesting comments about Prabhas Raja saab


రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, ప్రముఖ పీఆర్వో ఎస్కేఎన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజా సాబ్ సినిమా పరాజయం, దాని వెనుక ఉన్న కొన్ని పరిణామాలపై క్లారిటీ ఇచ్చారు. రాజా సాబ్ సినిమా నుంచి తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలు, ముఖ్యంగా తాత గెటప్ సంబంధించిన సన్నివేశాలు అభిమానులను తప్పుదోవ పట్టించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక చిత్రం మంచి ఫలితాన్ని అందుకున్నప్పుడు అందులోని ప్రతి నిర్ణయం సరైనదిగానే అనిపిస్తుందని, కానీ అదే చిత్రం సరిగా ఆడనప్పుడు ప్రతి చిన్న నిర్ణయం కూడా ప్రశ్నించబడుతుందని ఎస్కేఎన్ పేర్కొన్నారు.

ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు

రాజాసాబ్ టైటిల్ కార్డ్స్‌లో తన పేరు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కనిపించడంపై చాలా మందికి సందేహాలున్నాయని, వాటిపై ఎస్కేఎన్ పూర్తి వివరణ ఇచ్చారు. దర్శకుడు మారుతి తనపై ఉన్న అభిమానంతో ఆ గౌరవాన్ని ఇచ్చారని ఆయన వెల్లడించారు. వాస్తవానికి, బేబీ చిత్రం విడుదలకు ముందు, రాజాసాబ్ మరొక బ్యానర్ మీద తెరకెక్కాల్సి ఉందని ఎస్కేఎన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తాను ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాలని భావించానని తెలిపారు. మారుతితో ఉన్న అనుబంధం వల్ల ఆయన గత సినిమాలకు కూడా తాను ఎగ్జిక్యూటివ్ లేదా కో-ప్రొడ్యూసర్‌గా ఉన్నానని చెప్పారు.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

రాజాసాబ్ పరాజయం తర్వాత దర్శకుడు మారుతిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు, ఆయన ఇంటికి పార్సెల్స్ పంపడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వార్తలపై ఎస్కేఎన్ స్పందించారు. ఈ విషయాలను మీడియా అతిశయోక్తి చేసిందని ఆయన అన్నారు. నిజానికి పార్సెల్స్ పెద్ద సంఖ్యలో రాలేదని, నాలుగైదు పార్సెల్స్ వచ్చినా వాటిని వందల సంఖ్యలో వచ్చాయంటూ ప్రచారం చేశారని ఎస్కేఎన్ పేర్కొన్నారు. ప్రభాస్ అభిమానులు ఎవరూ మారుతిని అంతగా ఇబ్బంది పెట్టలేదని, బహుశా ప్రభాస్ అభిమానుల పేరు చెప్పుకుని యాంటీ ఫ్యాన్స్ ఈ చర్యలకు పాల్పడి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మారుతి ఈ సినిమా కోసం రెండేళ్లు, మూడేళ్లు ఎంతో కష్టపడ్డారని, అది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఒక ఎమోషనల్ జర్నీ అని ఎస్కేఎన్ గుర్తుచేసుకున్నారు. మారుతి పడిన కష్టాన్ని తాను దగ్గర నుండి చూశానని, అందుకే ఆయనతో తన ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎక్కువని ఎస్కేఎన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి



చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *