Headlines

ఊరిస్తున్న క్రేజీ కాంబోస్‌… కాసులు కురిపిస్తాయా? | Tollywood’s Next Big Pairings: Star Heroes Line Up Exciting New Combos video – Entertainment Videos in Telugu

ఊరిస్తున్న క్రేజీ కాంబోస్‌… కాసులు కురిపిస్తాయా? | Tollywood’s Next Big Pairings: Star Heroes Line Up Exciting New Combos video – Entertainment Videos in Telugu


టాలీవుడ్‌లో క్రేజీ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌ హీరోలు తమ నెక్ట్స్ మూవీస్ విషయంలో బిగ్ ప్లాన్స్‌ రెడీ చేస్తున్నారు. అందుకే అభిమానుల్లో అంచనాలు పెంచే కాంబోస్‌ సెట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో రిపీట్‌ కాంబోస్‌తో పాటు నయా జోడీస్‌ కూడా ఊరిస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. ప్రస్తుతం నటిస్తున్న ‘రాకా’ మూవీ పూర్తవ్వగానే బన్నీ ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఆ మూవీలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో బన్నీ, పూజా కాంబినేషన్‌లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’, ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ మరోసారి రిపీట్ కానుండటం, టాలీవుడ్‌లో పూజా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వనుండటం అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో మరో ప్యాన్ ఇండియా మూవీ రాబోతోంది. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించబోతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సుకుమార్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘పుష్ప’లో శ్రీవల్లిగా మెప్పించిన రష్మికకే మరోసారి ఆయన ఓటు వేశారన్న టాక్ వినిపిస్తోంది. గ్లామర్ హీరోయిన్‌గా కన్నా నటిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నా ఐశ్వర్యా రాజేష్ ఓ రిస్కీ డెసిషన్ తీసుకున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో హీరోయిన్‌గా కాకుండా.. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ పవర్ ఫుల్ పాత్రలో ఐశ్వర్య కనిపించబోతున్నారన్న వార్త ట్రెండ్ అవుతోంది. వీరితో పాటు మాస్ మహారాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతి కలిసి ముచ్చటగా మూడోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అటు యంగ్ హీరో సాయి దుర్గా తేజ్, ‘క’ దర్శకులు సుజీత్-సందీప్ కాంబోలో రాబోయే మూవీలో ప్రీతి ముకుందన్ పేరు వినిపిస్తోంది. అగ్ర కథానాయికల నుంచి కొత్త భామల వరకు అందరూ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

ట్రెండ్‌ మారింది గురూ.. వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *