Headlines

ఎలుక తోక అంత పొడవుగా ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న సీక్రెట్‌ తెలిస్తే.. | Why Do Rats Have Long Tails? The Amazing Reasons Behind This Unique Body Part!


మన ఇళ్లలో, పరిసరాల్లో ఎలుకలు తిరగడం సర్వసాధారణం. అయితే ఎలుకను చూడగానే మనకు ప్రత్యేకంగా కనిపించేది దాని పొడవైన తోక. చాలామంది ఆ తోక కేవలం ఒక శరీర భాగం మాత్రమే అనుకుంటారు. కానీ, ఎలుక జీవితంలో, మనుగడలో అది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జీవశాస్త్ర పరంగా ఎలుక తోక వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఇవే:

శరీర ఉష్ణోగ్రత నియంత్రణ:

ఎలుకల శరీరం మొత్తం వెంట్రుకలతో నిండి ఉన్నప్పటికీ, వాటి తోకపై మాత్రం వెంట్రుకలు ఉండవు. ఎలుకలకు మానవుల వలె చెమట గ్రంథులు ఉండవు. దీనివల్ల వేసవి కాలంలో లేదా కదలికల వల్ల పెరిగే శరీర వేడిని బయటకు పంపడానికి తోక కూలింగ్ సిస్టమ్‌లా పనిచేస్తుంది. తోకలోని రక్తనాళాలు విస్తరించి, రక్తాన్ని చల్లబరిచి మళ్లీ శరీరంలోకి పంపుతాయి. చలికాలంలో ఈ రక్తనాళాలు ముడుచుకుని శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా కాపాడతాయి.

అద్భుతమైన శరీర బ్యాలెన్సింగ్:

ఎలుకలు ఎత్తైన గోడలు, సన్నని విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలపై చాలా వేగంగా పరుగెత్తుతుంటాయి. అలా పడిపోకుండా ప్రయాణించడానికి తోక ప్రధాన బ్యాలెన్సర్‌గా ఉపయోగపడుతుంది. సర్కస్ ఆటగాడు తాడుపై నడిచేటప్పుడు కర్రను ఉపయోగించినట్లు, ఎలుక తన తోకను అటు ఇటూ తిప్పుతూ శరీరాన్ని స్థిరంగా ఉంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి



ప్రమాద సంకేతాలు,కమ్యూనికేషన్:

ఎలుకలు తమ తోక ద్వారా తోటి ఎలుకలతో భావవ్యక్తీకరణ చేస్తాయి. ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే తోకను నేలకు వేసి కొట్టడం లేదా ఊపడం ద్వారా ఇతర ఎలుకలను అప్రమత్తం చేస్తాయి.

శత్రువుల నుండి ఆత్మరక్షణ:

పిల్లులు, పాములు లేదా గద్దలు వంటి వేటాడే జంతువులు దాడి చేసినప్పుడు ఎలుకలు తప్పించుకోవడానికి తోక సహాయపడుతుంది. శత్రువు తోకను పట్టుకున్నప్పుడు ఎలుక దాన్ని వదిలించుకుని సులభంగా పారిపోగలదు. ఈ విధంగా ఎలుకల మనుగడకు, వాటి రోజువారీ కదలికలకు పొడవైన తోక ఒక వరంలా ఉపయోగపడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *