Headlines

ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..? | Hyderabad Vegetable Prices Today: Kukatpally Rythu Bazaar Releases Fresh Price List for July 27

ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..? | Hyderabad Vegetable Prices Today: Kukatpally Rythu Bazaar Releases Fresh Price List for July 27


హైదరాబాద్, జూలై 27: బియ్యం, ఉప్పు, పప్పులతోపాటు కూరగాయలు, పండ్లు ధరలు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సమాన్యుడు ఎప్పుడేం జరగుతుందో తెలియక కంగారు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్ జూలై 27కు సంబంధించిన తాజా కూరగాయల ధరల జాబితాను విడుదల చేసింది. టమాటా, ఆలుగడ్డ, దోసకాయ వంటి రోజువారీ అవసరమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తున్నా.. వెల్లుల్లి, ఎండు మిర్చి, అల్లం వంటి కొన్ని వస్తువుల ధరలు మాత్రం దడ పుట్టిస్తున్నాయి.

టమాటా, ఆలుగడ్డ ధరలు ఎంత?

రైతు బజార్‌లో టమాటా కిలో రూ.18, ఆలుగడ్డ కిలో రూ.18గా విక్రయిస్తున్నారు. అలాగే దోసకాయ, సొరకాయ కిలో రూ.15 మాత్రమే ఉండటంతో వినియోగదారులకు ఊరటనిస్తోంది.

ఇతర ముఖ్యమైన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..

  • వంకాయ కిలో ధర: రూ.23
  • బెండకాయ కిలో ధర: రూ.35
  • పచ్చిమిర్చి కిలో ధర: రూ.37
  • బజ్జి మిర్చి కిలో ధర: రూ.50
  • కాకరకాయ కిలో ధర: రూ.32
  • బీరకాయ కిలో ధర: రూ.38
  • క్యాబేజీ కిలో ధర:రూ.21
  • క్యారెట్ కిలో ధర: రూ.41
  • కాలీఫ్లవర్ కిలో ధర: రూ.25
  • దొండకాయ కిలో ధర: రూ.35
  • చిక్కుడుకాయ కిలో ధర: రూ.65
  • గోరుచిక్కుడు కిలో ధర: రూ.35
  • బీట్‌రూట్ కిలో ధర: రూ.32
  • క్యాప్సికమ్ కిలో ధర: రూ.45
  • కంద కిలో ధర: రూ.45
  • ఉల్లిగడ్డ కిలో ధర: రూ.32
  • ఉల్లితొడ కిలో ధర: రూ.55

పండ్లు, మసాలా దినుసుల ధరలు

  • బొప్పాయి కిలో ధర: రూ.40
  • ఉసిరి కిలో ధర: రూ.85
  • పల్లీలు కిలో ధర: రూ.75
  • ఎండు మిర్చి కిలో ధర: రూ.260
  • వెల్లుల్లి కిలో ధర: రూ.260
  • పాత అల్లం కిలో ధర: రూ.200
  • చింతపండు కిలో ధర: రూ.160
  • పండు మిర్చి కిలో ధర: రూ.80
  • కరివేపాకు కిలో ధర: రూ.50
  • అరటికాయ (ఒక్కటి): రూ.10 నుంచి రూ.11
  • ముల్లంగి (ఒక్కటి): రూ.6 నుంచి రూ.8
  • మునగకాయ (ఒక్కటి): రూ.8 నుంచి రూ.10
  • నిమ్మకాయలు (డజన్): రూ.26 నుంచి రూ.32
  • మామిడికాయ (ఒక్కటి): రూ.15 నుంచి రూ.20

నోట్: రైతు బజార్‌లలో నేరుగా రైతుల నుంచి కూరగాయలు విక్రయించబడటం వల్ల మార్కెట్‌తో పోలిస్తే కొంత తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు లభించే అవకాశం ఉంటుంది. అయితే సరఫరా, డిమాండ్‌ను బట్టి ధరల్లో రోజువారీ మార్పులు ఉండొచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *