Headlines

ఏం సినిమా రా అయ్యా..! మైండ్‌లోనుంచి పొవట్లేదు.!! దైర్యం ఉంటేనే చూడాల్సిన మూవీ | Do you know which horror movie is trending on OTT, It is Shambala

ఏం సినిమా రా అయ్యా..! మైండ్‌లోనుంచి పొవట్లేదు.!! దైర్యం ఉంటేనే చూడాల్సిన మూవీ | Do you know which horror movie is trending on OTT, It is Shambala


ఓటీటీల పుణ్యమా అని ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వీకెండ్ వస్తే చాలు ఆడియన్స్ అందరూ ఓటీటీలతో బిజీ అవుతున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంట్లో కూర్చొని ఓటీటీల్లో సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా వారానికి పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై మెప్పిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీ లవర్స్ ఎక్కువగా చూసే సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, హారర్ సినిమాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఓటీటీలో దూసుకుపోతుంది ఆ మూవీ.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు.. ఆది సాయి కుమార్​ హీరోగా నటించిన శంభాల. హారర్ ఫాంటసీ మిస్టికల్​ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆది సాయికుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. యుగంధర్​ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చనా అయ్యర్ ​హీరోయిన్ గా నటించింది. అలాగే స్వసిక, మధునందన్, రవి వర్మ, రామరాజు, హర్ష వర్దన్, అన్నపూర్ణ, లక్ష్మణ్ మీసాల, ఇంద్రనీల్ వర్మ, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1980వ దశకంలో శంభాల అనే ఒక ఊరిలో ఆకాశం నుంచి ఒక ఉల్క జారి పడుతుంది. అది పడిన తర్వాత ఆ ఊర్లో వింత అనుభవాలు ఎదురవుతాయి. దాంతో బండ భూతం తమ ఊరిలో పడిందని.. దానివల్ల మనుషులు వరుసగా చనిపోతున్నారు.. ఊరికి అరిష్టం అని జనాలు భావిస్తుంటారు. అదే ఊరికి సైంటిస్ట్ (ఆది సాయికుమార్) వస్తాడు. అసలేం జరిగింది అని తెలుసుకునే క్రమంలో అతడికి దేవి (అర్చన అయ్యర్) ఎలా సాయం చేసింది..? ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు ఆ ఊరికి ఏం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ జీ తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *