Headlines

ఐదుగురు అమ్మాయిలు పుట్టారని మా నాన్న నరకం చూపించాడు.. కొట్టి దెబ్బలపై కారం రాసేవాడు | Actress gayathri gupta sensational comments about her father

ఐదుగురు అమ్మాయిలు పుట్టారని మా నాన్న నరకం చూపించాడు.. కొట్టి దెబ్బలపై కారం రాసేవాడు | Actress gayathri gupta sensational comments about her father


నటి గాయత్రీ గుప్తా.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన ఈ అందాల నటి. సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆ మధ్య న్యూస్ లో ఎక్కువగా ఈమె పేరు వినిపించింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. తన జీవితంలోని పలు సున్నితమైన విషయాలను వెల్లడించారు. బాల్యం నుంచి తన తండ్రి వల్ల ఎదుర్కొన్న అమానవీయమైన వేధింపులను ఆమె పంచుకున్నారు. తన తండ్రి రోజూ చీపురు, చెప్పులు, టీవీ వైర్‌తో కొట్టేవారని, గాయాలపై కారం పొడి, నిమ్మరసం పిండేవారని ఆమె తెలిపారు. దాదాపు 25 ఏళ్ల వయస్సు వరకు ఇంట్లో అడుగుపెట్టిన ప్రతిరోజూ దెబ్బలు తినని రోజు లేదని, కన్నీళ్లతో నిద్రపోని రాత్రి లేదని గాయత్రీ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. 35 ఏళ్ల వరకు కూడా తాను ఏడుస్తూనే నిద్రపోయానని పేర్కొన్నారు.

తాను, తన తల్లి ఎక్కువగా ఈ హింసకు గురయ్యేవారని గాయత్రీ గుప్తా వెల్లడించారు. తన తండ్రికి అబ్బాయి కావాలని ఐదుగురు అమ్మాయిలు పుట్టారని, రెండుసార్లు అబార్షన్లు కూడా అయ్యాయని చెప్పారు. ఆడపిల్లలతో సంతృప్తి చెందక తన తల్లి, తమను చంపాలని కూడా చూశారని ఆరోపించారు. విడాకుల సమయంలో ఆస్తులు ఇవ్వకుండా తన తండ్రి చాలా దారుణంగా వ్యవహరించారని గాయత్రీ గుప్తా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి



తండ్రి ప్రేమకు నోచుకోని తాను, తన జీవితంలో తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయానని, ఒక కుటుంబం కావాలని తీవ్రంగా ఆకాంక్షించానని గాయత్రీ గుప్తా అన్నారు. ఈ ఆశతోనే చాలా సంబంధాలు పెట్టుకున్నానని, కానీ అవేవీ శాంతిని ఇవ్వలేదని పేర్కొన్నారు. ఒంటరిగా ఉన్నంత ప్రశాంతంగా ఏ బంధంలోనూ లేనని చెప్పారు. బ్రేకప్‌లు అయినప్పటికీ, కుటుంబం, ప్రేమ కావాలనే కోరికతో ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు శారీరక సంబంధాలలో పాల్గొనాల్సి వచ్చిందని, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని ఆమె వెల్లడించారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుండి బైసెక్సువల్ (ద్విలింగ సంపర్కురాలు) స్వభావం కలిగి ఉన్నానని, అమ్మాయిల పట్ల కూడా ఆకర్షితులయ్యేదానినని గాయత్రీ గుప్తా బయటపెట్టారు. సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ వల్ల చాలా మంది మహిళలు డిప్రెషన్‌కు గురవుతున్నారని, చాలా మందికి తమ ఆత్మగౌరవం తెలియకుండానే పెరుగుతున్నారని గాయత్రీ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ, అవగాహన ఉన్న తల్లిదండ్రులు ఉన్న కుటుంబాల్లో మాత్రమే ఆడపిల్లలు సంతోషంగా ఉంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *